కేటీఆర్ ని ఎవరూ ప్రత్యేకంగా ట్రోల్ చేయాల్సిన పని లేదు. గతంలో ఆయన మాట్లాడిన మాటలే ఆయన్ని ట్రోల్ చేస్తుంటాయి. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఇది రుజువైంది. తాజాగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సమయంలో కేటీఆర్ కి మరోసారి అలాంటి అనుభవమే ఎదురైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకు టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. కేవలం సింపతీ ఓట్లకోసమే ఈ పని చేసిందనే విషయం బహిరంగ రహస్యం. ఈ సందర్భంలో గతంలో సింపతీ ఓట్ల గురించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి.
?utm_source=ig_web_copy_link
అప్పుడేం జరిగింది..?
2014లో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో రాంరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. ఆయన మరణంలో రెండేళ్లకు పాలేరుకి ఉప ఎన్నిక వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఆయన సతీమణి రాంరెడ్డి సుచరిత రెడ్డికి టికెట్ ఇచ్చింది. అప్పటి టీఆర్ఎస్ తరపున ఉప ఎన్నికల బరిలో నిలిచిన తుమ్మల నాగేశ్వరరావు పాలేరు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రాంరెడ్డి వెంకట్ రెడ్డి సతీమణి సుచరిత రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. దివంగత నేత భార్యను కేవలం సింపతీ ఓట్ల కోసమే కాంగ్రెస్ బరిలో నిలిపిందని, ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వొచ్చు కదా అని లాజిక్ తీశారు. మరిప్పుడు బీఆర్ఎస్ చేస్తున్నదేంటి? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను ఏ లాజిక్ ప్రకారం బీఆర్ఎస్ బరిలో దింపిందని ప్రశ్నిస్తున్నారు. ఆమెకు గౌరవ ప్రదంగా ఎమ్మెల్సీ సీటు ఇవ్వొచ్చు కదా అని కేటీఆర్ ని ట్రోల్ చేస్తున్నారు.
, @KTRBRS ఒక్క సారి పాలేరు ఉపఎన్నికలోని ఫ్లాష్ బ్యాక్ కు పోదాం..
ఎమ్మానవ్ అన్న ఆరోజు చనిపోయిన రాంరెడ్డి గారి భార్య ను రాజకీయం కోసం ఎండలో ఎందుకు తిప్పుతున్నారు ఏ MLC ఓ మంచి పదవి ఇవ్వొచ్చుగా అని… అంతేనా ఇంకొక అడుగు ముందుకు వేసి సానుభూతి,కన్నీళ్లకు ఓటేస్తే అభివృద్ధి జరగదు అని… pic.twitter.com/fO2nNmdgX7
— AshaPriya Mudiraj 🇮🇳 (@ashapriya09) October 14, 2025
ప్రచారంలో కన్నీరు..
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ఓ వేదికపై మాగంటి సునీత కన్నీరు పెట్టుకున్నారు. ఆమె వీడియోలను బీఆర్ఎస్ సోషల్ మీడియా హైలైట్ చేస్తూ సింపతీ సీన్ క్రియేట్ చేసింది. తల్లి గెలుపుకోసం కూతుర్లు కూడా కష్టపడుతున్నారని కామెంట్లు పెట్టింది. గతంలో కేటీఆర్ ఇలాంటి కన్నీటి సీన్లపై అహంకారపూరితంగా వ్యాఖ్యలు చేశారని అంటున్నారు కాంగ్రెస్ అభిమానులు. అప్పట్లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ఇప్పుడు బీఆర్ఎస్ పోస్ట్ లకు జోడిస్తున్నారు. మాట మార్చడంలో కేటీఆర్ దిట్ట అని కామెంట్ చేస్తున్నారు.
Also Read: విశాఖకు గూగుల్.. జగన్ కు మాటల్లేవ్
జూబ్లీహిల్స్ పరిస్థితి ఏంటి?
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం అనంతరం లోక్ సభ ఎన్నికల్లో ఇరగదీస్తామంటూ బీఆర్ఎస్ నేతలు ప్రగల్భాలు పలికారు, కానీ ఏమైంది, జీరో సీట్లతో బీఆర్ఎస్ బొక్కబోర్లా పడింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మరోసారి పరువు పోగొట్టుకోడానికి సిద్ధమైనట్టు కనపడుతోంది. ఘోర పరాభవాన్ని తప్పించుకోడానికే తెలివిగా సింపతీ ఓట్లకోసం మాగంటి సునీతను బరిలో దింపారని అంటున్నారు నెటిజన్లు. పాలేరు ఉప ఎన్నికల సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ఇప్పుడు గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. సరిగ్గా ఎన్నికల వేళ ఈ ట్రోలింగ్ బీఆర్ఎస్ కి మరింత నెగెటివ్ గా మారే అవకాశం ఉంది. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కి పడే ఓట్లపై దీని ప్రభావం కచ్చితంగా ఉంటుందని అంటున్నారు నెటిజన్లు.
Also Read: ప్రిజనరీకి-విజనరీకి అదే తేడా-మంత్రి లోకేష్