Greater Kalesh On Netflix : దీపావళి సమయంలో ‘గ్రేటర్ కలేష్’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమాలో దీపావళి పండుగ సమయంలో ఫ్యామిలీలో గొడవలు జరుగుతుంటాయి. వీటిని దాటి పండుగను ఎలా సెలెబ్రేట్ చేస్తారన్నదే ఈ కథ. భారతదేశం అంతటా పండుగకు ముందు వాతావరణాన్ని ఉపయోగించుకోవడం ద్వారా, ఈ సినిమాకి వ్యూస్ కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ప్రజలు కూడా ఈ సినిమాని చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది ఏ ఓటీటీలోకి వస్తుంది ? కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘గ్రేటర్ కలేష్’ (Greater kalesh) 2025లో వచ్చిన హిందీ ఫ్యామిలీ డ్రామా సినిమా. అదిత్య చందీఓక్ దర్శకత్వంలో అహసాస్ చన్నా, పూజన్ చబ్రా, సుప్రియా శుక్లా, హ్యాపీ రణజిత్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 అక్టోబర్ 17 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. IMDbలో 7.5/10 రేటింగ్ పొందింది.
ట్వింకిల్ అనే యువతి ఢిల్లీలో జీవిస్తుంటుంది. ఆమె దీపావళి సమయంలో కుటుంబాన్ని సర్‌ప్రైజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. ఆమె గ్రేటర్ కలేష్ అనే హై క్లాస్ కాలనీలో ఉండే తన కుటుంబం ఇంటికి వస్తుంది. కానీ అక్కడ ఆమె ఊహించినట్టు ఉండదు. ట్వింకిల్ కుటుంబం మధ్య అందరూ ఎడమొహం, పెడ మొహం పెట్టుకుని ఉంటారు. ఆమె తల్లి, తండ్రి, సోదరుడు, ఇతర ఫ్యామిలీ మెంబర్స్ మధ్య చిన్న చిన్న సమస్యలు పెద్దవి అవుతాయి. ఇక ట్వింకిల్ తన సర్‌ప్రైజ్ ప్లాన్ బెడిసి కొడుతుంది. ఆమె తన కుటుంబ పరిస్థితిని చూసి టెన్షన్ అవుతుంది.
ఓ వైపు దీపావళి పండుగ, మరోవైపు ఫ్యామిలీ సమస్యలతో కథ లో ట్విస్ట్లు కూడా వస్తాయి. ట్వింకిల్ మధ్యలో ఇరుక్కుని, అందరినీ కలిపి, సమస్యలు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ కుటుంబం మధ్య గొడవలు పెరుగుతాయి. దీపావళి ప్రిపరేషన్స్ మధ్య ఎమోషన్స్ ఎక్కువవుతాయి. ట్వింకిల్ తన కుటుంబం గురించి మరింత తెలుసుకుంటూ, తన జీవితం గురించి కూడా ఆలోచిస్తుంది. ఇక క్లైమాక్స్ ఊహించని మలుపు తీసుకుంటుంది. ఈ మలుపు ఏమిటి ? ఈ ఫ్యామిలీలో గొడవలు ఎందుకు జరుగుతాయి ? ట్వింకిల్ వీళ్ళను కలుపుతుందా ? వీళ్ళంతా కలిసి దీపావళి సంబరాలు చేసుకుంటారా ? అనే విషయాలను, ఈ ఫ్యామిలీ డ్రామా సినిమాను చూసి తెలుసుకోండి.