BigTV English

RRB: ఇది అద్భుతమైన అవకాశం.. రైల్వేలో డిగ్రీతో భారీగా ఉద్యోగాలు, ఈ జాబ్ కొడితే లైఫ్ సెట్ బ్రో

RRB: ఇది అద్భుతమైన అవకాశం.. రైల్వేలో డిగ్రీతో భారీగా ఉద్యోగాలు, ఈ జాబ్ కొడితే లైఫ్ సెట్ బ్రో

RRB Jobs: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 6180 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అఫీషియల్ వెబ్ సైట్‌కి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్న వారు ఈ అద్భుత అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. నోటిఫికేషన్‌కు సంబంధించిన విద్యార్హత, వయస్సు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, ముఖ్యమైన తేదీల గురించి తెలుసుకుందాం.


రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు మొత్తం 6180 టెక్నీషియన్ గ్రేడ్-1, గ్రేడ్-2 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 51 విభాగాల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అన్ని రైల్వే జోన్ల వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. రైల్వే ఉద్యోగాలకు ప్రిపరే అయ్యే వారికి ఇది గోల్డెన్ అపార్చునిటీ అని చెప్పవచ్చు. ఇంతకు ముందు కొద్ది తేడాతో ఉద్యోగాలు మిస్ అయినవారు ఈ ఛాన్స్‌ను మిస్ చేసుకోవద్దు.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 6180


విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి డిగ్రీ, డిప్లొమా పాసై ఉండాలి.

నోటిఫికేషన్ విడుదల తేది: 2025 జూన్ 10

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జూన్ 28

దరఖాస్తుకు చివరి తేది: 2025 జూలై 28

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. టెక్నీషియన్ గ్రేడ్ -1 సిగ్నల్ ఉద్యోగానికి రూ.29,200 జీతం ఉంటుంది. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉద్యోగానికి రూ.19,900 జీతం ఉంటుంది.

ఇందులో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. అన్ని జోన్లలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

సౌత్ సెంట్రల్ రైల్వేలో 89 పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. ఎక్కువగా సదరన్ రైల్వేలో 1215 పోస్టులు ఈస్టర్న్ రైల్వేలో 1119 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్‌ను చూడొచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.rrbapply.gov.in/

అప్లికేషన్ లింక్: https://www.rrbapply.gov.in/

అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. అద్భుతమైన అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. టెక్నీషియన్ గ్రేడ్ -1 సిగ్నల్ ఉద్యోగానికి రూ.29,200 జీతం ఉంటుంది. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉద్యోగానికి రూ.19,900 జీతం ఉంటుంది.

ALSO READ: HPCL: డిగ్రీతో భారీగా ఉద్యోగాలు.. భారీ వేతనం, దరఖాస్తు ఇంకా 5 రోజులే గడువు

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 6180

దరఖాస్తుకు చివరి తేది: 2025 జూలై 28

జీతం: రూ.19,900 నుంచి రూ.29,200 వరకు

Related News

BSF Jobs: బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు

Indian Railway: రైల్వేలో 2418 ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండా ఉద్యోగ నియామకం

Indian Navy: టెన్త్, ఐటీఐ పాసైతే చాలు.. ఇండియన్ నేవీలో ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.. బంగారు భవిష్యత్తు

IB: రూ.69,000 జీతంతో ఉద్యోగాలు.. అవకాశం మళ్లీ రాదు బ్రో.. ఇంకా నాలుగు రోజులే?

Bank of Maharashtra: డిగ్రీ అర్హతతో 500 ఉద్యోగాలు.. జీతమైతే అక్షరాల రూ.93,960.. ఇంకెందుకు ఆలస్యం

EPFO: ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు, నో కాంపిటేషన్

Big Stories

×