Manchu Vishnu: సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు ఉన్న ఫ్యామిలీలో మంచు కుటుంబం (Manchu Family) కూడా ఒకటి. సినిమా ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతూ మోహన్ బాబు ఎంతో మంచి గుర్తింపు పొందారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలైన ఆయన ప్రయాణం కమెడియన్ గా, హీరోగా, నిర్మాతగా కూడా కొనసాగుతూ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇక మోహన్ బాబు వారసులుగా ఆయన కుమారులు తన కుమార్తె ముగ్గురు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో సక్సెస్ కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఇప్పటికే విష్ణు(Vishnu) మనోజ్ (Manoj)ఎన్నో సినిమాలలో నటించిన అనుకున్న స్థాయిలో మాత్రం సక్సెస్ అందుకోలేకపోయారు.
కన్నప్పతో రాబోతున్న విష్ణు…
ఇక త్వరలోనే మంచి విష్ణు కన్నప్ప(Kannappa) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో నటించడం విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలియజేశారు. తన సినిమా కోసం దాదాపు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నట్లు విష్ణు తెలిపారు. అయితే ఈ సినిమా జూన్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. అయితే మంచు విష్ణుకి సంబంధించిన ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి. గతంలో విష్ణు చేసిన కొన్ని వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది…
ఇకపోతే విష్ణు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh)గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు..ఇండస్ట్రీలో డేర్ అండర్ డాష్ డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఈయన దర్శకత్వంలో దాదాపు తెలుగు హీరోలందరూ కూడా సినిమాలు చేసి ఇండస్ట్రీ హిట్ అందుకున్న వారే. అయితే ఇటీవల కాలంలో పూరి జగన్నాథ్ సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. అయితే పూరి జగన్నాథ్ గురించి విష్ణు మాట్లాడుతూ ఒకప్పుడు పూరి జగన్నాథ్ క్యారెక్టర్ G.O.A.T అంటూ అవి వర్ణించారు ప్రస్తుతం పూరి జగన్నాథ్ పూర్తిగా మారిపోయారని అయినా ఇప్పుడు అతని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అంటూ వ్యాఖ్యానించారు.
గతంలో మీరేం సాధించారు…
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై పూరి జగన్నాథ్ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నువ్వేమైనా తోపు అనుకుంటున్నావా? విష్ణు పూరి జగన్నాథ్ గురించి అలా మాట్లాడటానికి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మీరు ఒకానొక సమయంలో కూడా ఏం పీకలేదు కదా? మరి అలాంటప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ అన్ని ఎందుకు ఇవ్వడం? మీ గురించి మా అభిప్రాయం కూడా అదే అంటూ పూరి జగన్నాథ్ అభిమానులు మంచు విష్ణుని ఓ రేంజ్ లో ఏకిపారేస్తున్నారు. ఇక విష్ణు కన్నప్ప సినిమా విడుదల సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయటంతో ఇవి కాస్త సంచలనంగా మారాయి. చాలా రోజుల తర్వాత కన్నప్ప లాంటి భారీ బడ్జెట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విష్ణుకి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.
Also Read: Chiranjeevi Fan: చిరు కోసం అభిమాని నిరాహార దీక్ష.. చచ్చినా పర్వాలేదంటూ!