BigTV English

OTT Movie : అందమైన అమ్మాయి అని సొల్లు కారిస్తే ప్యాంట్ తడిచిపోయే ట్విస్ట్… ఇలాంటి హర్రర్ సీన్లు నెవర్ బిఫోర్

OTT Movie : అందమైన అమ్మాయి అని సొల్లు కారిస్తే ప్యాంట్ తడిచిపోయే ట్విస్ట్… ఇలాంటి హర్రర్ సీన్లు నెవర్ బిఫోర్

OTT Movie : కొరియన్ సినిమాలను ఇప్పుడు ఓటీటీలో బాగా ఫాలో అవుతున్నారు మూవీ లవర్స్. ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్ తో ఇవి వస్తున్నాయి. అందుకే ఈ మధ్య తెలుగు సీరియల్స్ కి బదులు, కొరియన్ సిరీస్ లను, సినిమాలను ఎక్కువగా చూస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొరియెన్ సినిమా, ఆరు స్టోరీలతో అబ్బురపరుస్తుంది. ఈ సినిమా ఒక్కో స్టోరీ, ఒక్కో ట్విస్ట్ తో షాక్ ఇస్తుంది. ఈ స్టోరీలు చూడాటానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


నెట్ ఫ్లిక్స్ (Netflix)లో

ఈ కొరియన్ హారర్-థ్రిల్లర్ మూవీ పేరు ‘న్యూ నార్మల్’ (New normal). 2022 లో వచ్చిన ఈ సినిమాకి జంగ్ బం-షిక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2022 జూలై 17న 26వ బుచియాన్ ఇంటర్నేషనల్ ఫాంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వరల్డ్ ప్రీమియర్‌గా ప్రదర్శించబడింది. 2023 నవంబర్ 8న దక్షిణ కొరియాలో విడుదలైంది. ఇందులో చోయి జి-వూ, లీ యూ-మి, చోయి మిన్-హో, జంగ్ డాంగ్-వోన్, ప్యో జి-హూన్, హా డా-ఇన్ వంటి నటులు నటించారు. ఈ స్టోరీ సియోల్‌లో నాలుగు రోజులలో జరిగే ఆరు భిన్నమైన కథలను కలిగి ఉంది. ఈ కథలు నాన్-లీనియర్ ఫార్మాట్‌లో అల్లుకుని ఉంటాయి. 1 గంట 51 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి, IMDb లో 6.2/10 రేటింగ్ ఉంది. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ సియోల్‌ నగరంలో జరిగే ఆరు స్టోరీలతో నడుస్తుంది. ఇవన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అవుతాయి.


స్టోరీలోకి వెళితే

డోర్ లాక్: హ్యూన్-సూ అనే యువతి, ఒక అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా జీవిస్తుంటుంది . ఆమె తన ఇంటి డోర్‌లాక్ పాస్‌వర్డ్ ఎవరో మార్చినట్లు గమనిస్తుంది. అంతేగాక ఆమె అపార్ట్‌మెంట్‌లో వింత శబ్దాలు వినిపిస్తాయి. ఆమె భయంతో అక్కడ వెతుకుతున్నప్పుడు, ఒక అపరిచితుడు ఆమెను గమనిస్తున్నాడని తెలుస్తుంది. ఈ సెగ్మెంట్ ఒంటరిగా జీవించే మహిళలు ఎదుర్కొనే భయాలను, సెక్యూరిటీ సిస్టమ్స్ వైఫ్యల్యాలను చూపిస్తుంది.

డేటింగ్ యాప్: జి-మిన్ అనే యువతి, ఒక డేటింగ్ యాప్ ద్వారా ఒక వ్యక్తిని కలుస్తుంది. అయితే ఆమె కలిసిన వ్యక్తి తను ఊహించిన విధంగా లేడని తెలుసుకుంటుంది. అతని ప్రవర్తన కూడా చాలా తేడాగా ఉంటుంది. ఈ సెగ్మెంట్ ఆన్‌లైన్ డేటింగ్ ప్రమాదాలను హైలైట్ చేస్తుంది.

జాగర్: హాన్-సాంగ్ అనే ఒక వృద్ధుడు సియోల్ వీధుల్లో రాత్రిపూట జాగింగ్ చేస్తూ, తన చుట్టూ జరిగే వింత సంఘటనలను గమనిస్తాడు. అతనికి ఒక వ్యక్తి మీద అనుమానం రావడంతో, అతన్ని ఫాలో చేయడం ప్రారంభిస్తాడు. కానీ ఈ చర్య అతన్ని ఒక ప్రమాదకరమైన సిచుయేషన్‌లోకి తీసుకెళ్తుంది.

ఘోస్ట్ బాల్: సియోంగ్-మిన్ అనే ఒక యువకుడు వీడియో గేమ్‌లో చిక్కుకుంటాడు. గేమ్‌లో అతను తీసుకునే నిర్ణయాలు, అతని చుట్టూ ఉన్నవారి జీవితాలపై ప్రభావం చూపుతాయి. అతను ఒక భయంకరమైన రియాలిటీలో చిక్కుకుంటాడు. ఈ సెగ్మెంట్ గేమింగ్ వ్యసనం వల్ల కలిగే దుష్పరిమాణాలను చూపిస్తుంది.

డోర్‌బెల్: డూ-హ్యూన్, యూ-జిన్ అనే జంట, ఒక కొత్త అపార్ట్‌మెంట్‌లో స్థిరపడతారు. కానీ వారి డోర్‌బెల్ కెమెరా అనుమానస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను రికార్డ్ చేస్తుంది. వాళ్ళు ఉండే ఇంటిలో వింత సంఘటనలు జరగడం ప్రారంభమవుతుంది. ఈ కథ సర్వైలెన్స్ టెక్నాలజీ గోప్యత లేకపోవడం వల్ల వచ్చే సమస్యల చుట్టూ తిరుగుతుంది.

స్పెషల్ డెలివరీ: జున్-వూ అనే ఒక డెలివరీ బాయ్, ఒక ప్యాకేజీని డెలివర్ చేయడానికి ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌కు వెళ్తాడు. అక్కడ అతను ఒక వింత కస్టమర్‌ను కలుస్తాడు. ఆ ప్యాకేజీ అతన్ని ఒక భయంకరమైన సంఘటనలోకి లాగుతుంది. ఈ సెగ్మెంట్ ఆధునిక జీవనంలోని లోటు పాట్లును చూపిస్తుంది.

Read Also : కొండ ప్రాంతంలో లవర్స్ వీకెండ్ ట్రిప్… అమ్మాయి డెడ్ బాడీతో ఈ మలయాళ మిస్టరీ థ్రిల్లర్ లో ఊహించని మలుపు

Related News

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 31 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

OTT Movie : పిల్లల్ని తినేసే నల్ల పిశాచి… మోస్ట్ స్కేరీయెస్ట్ హర్రర్ మూవీ… రాత్రిపూట ఒంటరిగా చూడకూడని మూవీ

OTT Movie : బాబోయ్… అమాయకురాలు అనుకుంటే అడ్డంగా నరికేసే ఆడ సైకో… ఈ పిల్ల పిశాచి వేషాలకు మెంటలెక్కాల్సిందే

OTT Movie : రోబోతో ఇదేం పాడు పనిరా అయ్యా… అది రివేంజ్ మోడ్ లో చేసే అరాచకం రచ్చ రచ్చే

OTT Movie : స్కూల్లో మిస్టీరియస్ మరణాలు… ఆ పని చేసే స్టూడెంట్సే ఈ దెయ్యం టార్గెట్… దడ పుట్టించే తమిళ హర్రర్ మూవీ

OTT Movie : భార్య చర్మం వలిచి ఇదెక్కడి దిక్కుమాలిన పనిరా అయ్యా… చేతబడిని నమ్మనోళ్లు చూడాల్సిన మూవీ

Big Stories

×