Central Bank Jobs: బీఈ, బీటెక్ పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష్ రిలీజైంది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్‌లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.
నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ (రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్), సెంట్రల్ ఆఫీస్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ద్వారా రెగ్యులర్ ప్రాతిపదికన సీబీఐ శాఖల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ వివరాలను పూర్తిగా చూసేద్దాం.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 62
ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
డేటా ఇంజినీర్/ అనలిస్ట్ పోస్టులు : 3
డేటా సైంటిస్ట్ పోస్టులు : 2 పోస్టులు
డేటా-ఆర్కిటెక్ట్/ క్లౌడ్ ఆర్కిటెక్ట్/ డిజైనర్/ మోడలర్ పోస్టులు : 2
ఎంఎల్ ఓపీఎస్ ఇంజినీర్ పోస్టులు పోస్టులు : 2
జీఈఎన్ ఏఐ ఎక్స్‌పర్ట్ (లార్జ్ లాంగ్వేజ్ మోడల్) పోస్టులు పోస్టులు : 2
క్యాంపెయిన్ మేనేజర్ (ఎస్‌ఈఎం అండ్ ఎస్‌ఎంఎం) పోస్టులు : 1
ఎస్‌ఈవో స్పెషలిస్ట్ పోస్టులు : 1
గ్రాఫిక్ డిజైనర్ అండ్ వీడియో ఎడిటర్ పోస్టులు : 1
కంటెంట్ రైటర్ (డిజిటల్ మార్కెటింగ్) పోస్టులు : 1
ఎంఏఆర్ టెక్ స్పెషలిస్ట్ పోస్టులు : 1
నియో సపోర్ట్ రిక్వైర్‌మెంట్- ఎల్2 పోస్టులు : 6
నియో సపోర్ట్ రిక్వైర్‌మెంట్- ఎల్1 పోస్టులు : 10
ప్రొడక్షన్ సపోర్ట్/ టెక్నికల్ సపోర్ట్ ఇంజినీర్ పోస్టులు : 10
డిజిటల్ పేమెంట్ అప్లికేషన్ సపోర్ట్ ఇంజినీర్ పోస్టులు : 10
డెవలపర్/ డేటా సపోర్ట్ ఇంజినీర్ పోస్టులు : 10
విద్యార్హత: బీఈ, బీటెక్ (కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ అప్లికేషన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్/ డేటా సైన్స్) ఎంసీఏ/ ఎంఎస్సీ (కంప్యూటర్) ఉత్తీర్ణతతో పాటు కనీసం ఆరేళ్ల పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఎలాంటి రాత పరీక్ష లేదు. అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూ ప్రక్రియ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.750( ఎస్సీ, ఎస్టీ,దివ్యాంగ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది)
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: జనవరి 12
ఇంటర్వ్యూ తేదీలు: 2025 జనవరి చివరి వారంలో జరిగే అవకాశం ఉంది.
Also Read: Supreme Court Recruitment: కోర్టులో జాబ్స్.. వీళ్లందరూ అర్హులే..!! జీతం ఏడాదికి.. రూ.9,60,000
ఆసక్తి గల అభ్యర్థులు ఇంటర్వూకి హాజరవ్వండి. ఉద్యోగాన్ని సాధించిండి. ఆల్ ది బెస్ట్.