Mohammed Shami: టీమిండియాకు ( Team India) అదిరిపోయే శుభవార్త అదిరిపోయే అందింది. ఇంగ్లాండ్ తో (England ) టీ20 సిరీస్ కోసం టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ( Mohammed Shami ) రీ- ఎంట్రీ ఇవ్వనున్నారట.
ఇంగ్లండ్‌తో టీమిండియా టీ 20, వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కంటే ముందు టీమిండియాకు అదిరిపోయే శుభవార్త అదిరిపోయే అందిందని చెప్పవచ్చు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ రీ- ఎంట్రీ ఇస్తున్నాడు. ఇంగ్లండ్‌తో జనవరి 22న కోల్‌కతాలో ఐదు మ్యాచ్‌ల టీ20 మ్యాచ్‌ల సీరిస్ ప్రారంభం అవుతుంది. ఇక ఈ సందర్భంగా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ( Mohammed Shami ) పునరాగమనం చేయనున్నాడని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ చివరిసారిగా అహ్మదాబాద్‌లో జరిగిన 2023 ప్రపంచ కప్ ఫైనల్‌లో టీమిండియా తరపున ఆడాడు. అంటే దాదాపు టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ టీమిండియా తరఫున ఆడి.. 400 రోజులు అయిపోయింది. అయితే… 2023 ప్రపంచ కప్ ఫైనల్ సందర్భంగా చీలమండ గాయం కారణంగా శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది మహ్మద్ షమీ ( Mohammed Shami ). దీని కోసం విదేశాలకు వెళ్లాడు మహ్మద్ షమీ. ఆ తర్వాత 34 ఏళ్ల మహ్మద్ షమీ…. రంజీ ట్రోఫీలో ఆడి.. ఫిట్ నెస్ ఫ్రూవ్ చేసుకున్నాడు.
Also Read: Big Bash league: కొడుకు భారీ సిక్స్..క్యాచ్ పట్టిన తండ్రి..వీడియో చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే !
అటు T20 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా ఆడాడు మహ్మద్ షమీ. ప్రస్తుతం కొనసాగుతున్న 50 ఓవర్ల విజయ్ హజారే ట్రోఫీని ఆడుతున్నాడు మహ్మద్ షమీ. ఈ దేశవాలీ ట్రోఫీల్లో మహ్మద్ షమీ ( Mohammed Shami ) అదరగొడుతున్నాడు. అయితే ఇటీవలే మహ్మద్ షమీ మోకాలు వాపు వచ్చిందట. ఈ కారణంగా ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024- 2025 టోర్నమెంట్ నుంచి చివరి క్షణంలో దూరం కావాల్సి వచ్చింది మహ్మద్ షమీ ( Mohammed Shami ).
అయితే.. తాజాగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఇంగ్లాండ్ తో టీ20 లు ఆడనున్నారట. అలాగే…. రిషబ్ పంత్ ను భారత T20I స్క్వాడ్ నుంచి తొలగించారట. అటు ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్‌ను మొదటి ఎంపికగా తీసుకున్నారని సమాచారం. అదే సమయంలో ధృవ్ జురెల్‌ను జట్టులో రెండవ వికెట్ కీపర్‌గా ఎంచుకున్నారు బీసీసీఐ సెలక్టర్లు. జితేష్ శర్మ స్థానంలో జురెల్ వచ్చాడు. ఆస్ట్రేలియా టెస్టు పర్యటనలో రమణదీప్ సింగ్ స్థానంలో ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి కూడా టీ20 జట్టులో భాగమయ్యాడు. మరో ఆల్‌రౌండర్ శివమ్ దూబే జట్టు నుంచి వైదొలిగినట్లు సమాచారం. మరోవైపు అభిషేక్ శర్మ స్థానంలో యశస్వి జైస్వాల్ ఓపెనర్ గా రానున్నాడట. ఈ టోర్నమెంట్ కు అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. దీంతో పాండ్యాకు షాక్ తగిలింది.
Also Read: Pakistan Squad for WI: వెస్టిండీస్‌తో సిరీస్…షాహీన్ అఫ్రిదికి షాక్..7 మార్పులతో పాక్ టీం రెడీ ?
ఇంగ్లాండ్ సిరీస్ కోసం భారత T20I స్క్వాడ్ అంచనా
భారత T20I స్క్వాడ్: సూర్య కుమార్ యాదవ్ (సి), శాంసన్, జైస్వాల్, తిలక్ వర్మ, నితీష్ రెడ్డి, మహమ్మద్ షమీ ( Mohammed Shami ), అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, ధృవ్ జురెల్, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, అక్సర్ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్, సుందర్
🚨 BREAKING 🚨
The Men’s Selection Committee has announced India’s 15-man squad for the upcoming five-match T20I series against England, starting 22nd January.
🔹 Mohammad Shami makes his comeback after a long injury layoff
🔸 Axar Patel named vice-captain#INDvENG… pic.twitter.com/WVsLW0q2GI— Sportskeeda (@Sportskeeda) January 11, 2025