Liam Livingstone: ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు చెందిన కీలక ప్లేయర్ లియామ్ లివింగ్ స్టోన్ ( Liam Livingstone) అదిరిపోయే శుభవార్త చెప్పాడు. బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పిన లియామ్ లివింగ్‌స్టోన్, పెళ్లి పీటలు ఎక్కాడు. ఇవాళ ఉదయం లియామ్ లివింగ్ స్టోన్ వివాహం చాలా సీక్రెట్ గా జరిగింది. తన ప్రియురాలు అయిన కేటీ మోఫాట్ అనే అమ్మాయిని లియామ్ లివింగ్ స్టోన్ పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గత సంవత్సరమే వీళ్లిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇవాళ ఉదయం పెళ్లి చేసుకున్నారు లియామ్ లివింగ్‌స్టోన్, కేటీ మోఫాట్ ( Katie Moffat). ఈ ఫోటోలు వైరల్ కావడంతో లియామ్ లివింగ్‌స్టోన్ అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు.
Also Read: Abhishek Sharma Sister Wedding: ఇండియా కోసం త్యాగం…వీడియో కాల్ లో సోదరి పెళ్లి చూసిన అభిషేక్ శర్మ
ఇంగ్లాండ్ కు చెందిన స్టార్ ఆటగాడు లియామ్ లివింగ్ స్టోన్…ఆ జట్టులో కీలక ప్లేయర్. ఆల్ రౌండర్ కూడా. ఇక తన ప్రియురాలి కేటీ మోఫాట్ తో గతేడాది ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు లియామ్ లివింగ్ స్టోన్. ఎంగేజ్మెంట అయిన తర్వాత కూడా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఈ తరుణంలో.. లియామ్ లివింగ్ స్టోన్, ఆయన ప్రియురాలు కేటీ మోఫాట్ ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే… ఇవాళ ఈ జంట పెళ్లి చేసుకుంది. తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే చాలా సీక్రెట్ గానే లియామ్ లివింగ్ స్టోన్ వివాహం జరిగిందని అంటున్నారు. క్రిస్టియన్ పద్దతిలోనే లియామ్ లివింగ్ స్టోన్ పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా బిస్కెట్ కలర్ డ్రెస్ లో మెరిసాడు లియామ్ లివింగ్ స్టోన్. అటు ఆయన భార్య క్రీమ్ అండ్ వైట్ కలర్ లో సందడి చేశారు. వీళ్ల ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో కూడా లియామ్ లివింగ్‌స్టోన్ ఆడుతున్న సంగతి తెలిసిందే. 2019 నుంచి ఈ టోర్నమెంట్ లో కొనసాగుతున్నాడు ఇంగ్లాండ్ లియామ్ లివింగ్‌స్టోన్. 2019 నుంచి 2021 వరకు రాజస్థాన్ రాయల్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం పంజాబ్ కింగ్స్ జట్టులోకి వెళ్ళాడు. 2022 టాటా ఐపిఎల్ సమయంలో 11.50 కోట్లకు లియామ్ లివింగ్‌స్టోన్ ను పంజాబ్ కింగ్స్ చేసింది. కానీ పంజాబ్ తరఫున ఆడిన లియామ్ లివింగ్‌స్టోన్ పెద్దగా రాణించలేదు. ఈ నేపథ్యంలోనే మొన్న జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 8.75 కోట్లకు ఇతన్ని కొనుగోలు చేసింది. ఈసారి రాయల్ చాలెంజర్ బెంగళూరు చాంపియన్ కూడా అయింది.
Liam Livingstone begins a new innings in life as he ties the knot! 💍❤️#LiamLivingstone #InsideSport #CricketTwitter pic.twitter.com/KGuVaR8zeH
— InsideSport (@InsideSportIND) October 5, 2025