BigTV English

CPCB Jobs: సెంట్రల్ పొల్యూషన్‌ కంట్రోల్ బోర్డులో జాబ్స్.. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైతే చాలు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?

CPCB Jobs: సెంట్రల్ పొల్యూషన్‌ కంట్రోల్ బోర్డులో జాబ్స్.. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైతే చాలు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?

CPCB Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. బీటెక్‌, ఎల్ఎల్‌బీ, డిగ్ర్రీ, మాస్టర్స్ డిగ్రీ, ఇంటర్‌, పదోతరగతి పాసైన అభ్యర్థులకు ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పవచ్చు. సెంటర్ల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఢిల్లీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది.


ఢిల్లీ, సెంట్రల్ పొల్యూషన్‌ కంట్రోల్ బోర్డ్‌(CPCB) లో సైంటిస్ట్ బీ, అసిస్టెంట్ లా ఆఫీసర్, సీనియర్ టెక్నికల్ సూపర్ వైజర్, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, తదరిత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 28వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read: Jobs: డిగ్రీ అర్హతతో మన ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.30,000.. రేపే లాస్ట్ డేట్


మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 69

ఢిల్లీ, సెంట్రల్ పొల్యూషన్‌ కంట్రోల్ బోర్డ్‌ లో వివిధ రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

పోస్టులు – వెకెన్సీలు:

సైంటిస్ట్‌-బీ: 22
అసిస్టెంట్ లా ఆఫీసర్‌: 01
సీనియర్ టెక్నికల్ సూపర్‌వైజర్‌: 02
సీనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్: 04
టెక్నికల్ సూపర్‌వైజర్‌: 05
అసిస్టెంట్‌: 04
అకౌంట్స్‌ అసిస్టెంట్: 02
జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌: 01
సీనియర్‌ డ్రాట్స్‌మ్యాన్‌: 01
జూనియర్ టెక్నీషియన్‌: 02
సీనియర్‌ ల్యాబోరేటరీ అసిస్టెంట్: 02
యూడీసీ: 08
డేటా ఎంట్రీ ఆపరేటర్‌ గ్రేడ్‌-2: 01
స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-2: 03
జూనియర్ ల్యాబోరేటరీ అసిస్టెంట్: 02
ఎల్‌డీసీ: 05
ఫీల్డ్‌ అటెండెంట్‌: 01
మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌: 03

దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 28

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో టెన్త్, ఇంటర్ లేదా బీటెక్‌, ఎల్ఎల్‌బీ, డిగ్ర్రీ, మాస్టర్స్ డిగ్రీ పాసై ఉండాలి. వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. సైంటిస్ట్-బీ పోస్టులకు 35 ఏళ్లు, అసిస్టెంట్ లా ఆఫీసర్‌, సీనియర్ టెక్నికల్ సూపర్‌వైజర్‌, సీనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్, టెక్నికల్ సూపర్‌వైజర్‌, అసిస్టెంట్‌, అకౌంట్స్‌ అసిస్టెంట్, జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌, సీనియర్‌ డ్రాట్స్‌మ్యాన్‌ పోస్టులకు 30 ఏళ్లు, మిగతా ఉద్యోగాలకు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష, విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

వేతనం: నెలకు సైంటిస్ట్‌-బీ పోస్టులకు రూ.56,100 – రూ.1,77,500 జీతం ఉంటుంది. అసిస్టెంట్ లా ఆఫీసర్‌, సీనియర్‌ టెక్నికల్ సైపర్ వైజర్‌కు రూ.44,900 – రూ.1,42,400 జీతం ఉంటుంది. సీనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్, టెక్నికల్ సూపర్‌వైజర్‌, అసిస్టెంట్‌, అకౌంట్స్‌ అసిస్టెంట్, జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌, సీనియర్‌ డ్రాట్స్‌మ్యాన్‌కు రూ.35,400 – రూ.1,12,400 వేతనం ఉంటుంది.

జూనియర్ టెక్నీషియన్‌, సీనియర్‌ ల్యాబోరేటరీ అసిస్టెంట్, యూడీసీ, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ గ్రేడ్‌-2, స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-2కు రూ.25,500 – రూ.81,100 జీతం ఉంటుంది. జూనియర్ ల్యాబోరేటరీ అసిస్టెంట్, ఎల్‌డీసీ పోస్టులకు రూ.19,900 – రూ.63,200 జీతం ఉంటుంది. ఫీల్డ్‌ అటెండెంట్‌, ఎంటీఎస్‌ పోస్టులకు రూ.18,000 – రూ.56,900 జీతం ఉంటుంది.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://cpcb.nic.in/

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం పోస్టుల సంఖ్య: 69

దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 28

విద్యార్హత: టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్

Also Read: Jobs in Japan: తెలంగాణ రాష్ట్ర యువతకు శుభవార్త.. జపాన్‌లో భారీగా ఉద్యోగ అవకాశాలు

Related News

Indian Army Jobs: రూ. 18 లక్షల జీతంతో.. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

Telangana Govt Jobs: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు.. మెరిట్ లిస్ట్ రిలీజ్, ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్

DSSSB Jobs: సబార్డినేట్ సర్వీసెస్‌లో 615 ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే అప్లై చేసుకోవచ్చు

CCRAS: పది, ఇంటర్ పాసైన వారికి సువర్ణవకాశం.. మంచి వేతనం, ఇలా దరఖాస్తు చేసుకోండి..

Union Bank of India: యూనియన్ బ్యాంక్‌‌లో ఉద్యోగాలు.. అక్షరాల రూ.93,960 జీతం.. క్వాలిఫికేషన్ ఇదే..

DSSSB Jobs: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్‌లో 2119 ఉద్యోగాలు.. టెన్త్, ఇంటర్ పాసైతే చాలు.. ఇంకా 3 రోజులే..?

Big Stories

×