Big TV Kissik Talk Show : బుల్లితెర సీరియల్ నటులు అమర్ దీప్, తేజస్విని పరిచయం అక్కర్లేని జంట. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోను, ప్రశంసలు అందుకుంటున్న సీరియల్ కపుల్. రియల్ లైఫ్ లో వారి ప్రేమ కథ అందరికీ తెలిసిందే. అమర్ జానకి కలగన లేదు సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సీరియల్ లో హీరోయిన్ కి సపోర్ట్ చేసే హీరో క్యారెక్టర్ గా, రామా పాత్రకి న్యాయం చేశారు. ఆ తర్వాత ఉయ్యాల జంపాలా సీరియల్ లోను నటించారు. కోయిలమ్మ సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటి తేజస్విని. అమర్ ని పెళ్లి చేసుకున్న తర్వాత సీరియల్స్ కి కాస్త బ్రేక్ వచ్చినా, టీవీ షోలలో కనిపిస్తూనే ఉన్నారు. తాజాగా తేజస్విని స్పందించారు. జబర్దస్త్ వర్ష హోస్ట్ వ్యవహరిస్తున్న, బిగ్ టీవీ కిసిక్క్ టాక్ షోలో తేజస్విని ముచ్చటించారు. ఆమె వర్ష వేసే ప్రశ్నలకు సూటిగా సమాధానం చెబుతూ అధ్యంతం షోలో నవ్వులు కురిపించారు. ఈ తెలుగింటి అమ్మాయి బిగ్ టీవీ కిసక్ టాక్ షోలో ఏం మాట్లాడిందో ఇప్పుడు చూద్దాం..
బిగ్ టీవీ కిస్ టాక్స్ కిసిక్క్ టాక్ షో కి తెలుగింటి అందాల తార తేజస్విని గౌడ వచ్చింది.
వర్ష :ఇప్పుడు మీ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి?
తేజు: తమిళ్ లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఒక మూవీ లో చిన్న క్యారెక్టర్ కమిట్ అయ్యాను. పూర్తి వివరాలు త్వరలోనే చెప్తాను.
వర్ష : టీవీలో మీ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఎవరు ?
తేజు : ఇలా అడిగితే చాలా కష్టంగా ఉంటుంది. అమర్ కాకుండా ప్రెసెంట్ గా గుర్తొస్తుంది సుజాత. తను చాలా బాగా యాక్ట్ చేస్తుంది. అయితే కావ్య బాగా చెయ్యదంటావా.. ఈ విషయం కావ్య తో చెప్తాను అంటుంది వర్ష.
వర్ష : అందమైన రొమాంటిక్ కపుల్ లా మీరిద్దరూ ఉంటారు. అమర్దీప్ గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు.
తేజు: అమర్ గురించి చెప్పాలంటే చాలా దగ్గరగా చూసిన వాళ్లకే తెలుస్తుంది తనది చిన్నపిల్లల మనస్తత్వం. ఓపెన్ హార్ట్ అండ్ ఓపెన్ మైండ్. కొన్ని కొన్ని సార్లు చూసే జనానికి ఈ అబ్బాయి ఏంటి ఇంత ఆటిట్యూడ్ గా ఉంటాడు అని అనిపిస్తుంది కానీ మనిషి వేరేలా ఉంటాడు. మీరు ఓపెన్ హార్ట్ చూసి లవ్ చేశారా అంటే.. అవును, అది నచ్చే నేను ఆయన్ని లవ్ చేశాను అని చెప్తుంది తేజస్విని.
వర్ష :అమర్ కి తేజు దొరకడం లక్కా.. తేజుకి అమర్ దొరకడం అదృష్టమా ..
తేజు :అమర్ నీకు నేను దొరకడం అదృష్టం. నాకు నువ్వు దొరకడం అదృష్టం అని అంటాడు. బయట ఎవరైనా అడిగితే మాత్రం నేను దొరకడమే తనకు అదృష్టం అని చెప్తాడు.
వర్ష : అమర్ లో నచ్చని క్వాలిటీ ఏమిటి?
తేజు : ఎవరైనా తొందరగా నమ్మేస్తాము. మనకి ఎవర్ని నమ్మాలో లేదో తెలీదు. మనం చెప్పిన వినడు నాకు ఏది అనిపిస్తే అదే చేస్తాను అనే మనస్తత్వం మనం చెప్పిన వినడు. అవతల వ్యక్తిని గుడ్డిగా నమ్మేస్తాడు ఈమధ్య కొంచెం మారాడు. అమర్ కన్నా తేజు తెలివైంది, కాబట్టి అమర్ ని కంట్రోల్ చేస్తుంది అని వర్ష అంటుంది. అది మంచితనం అనాలో, లేదంటే తనలో ఉన్న డిసడ్వాంటేజ్ అనాలో నాకు ఒకసారి అర్థం కాదు. అది అన్నిసార్లు సెట్ అవ్వదు. థర్డ్ పర్సన్ వల్ల గొడవలు జరిగినాయి. కాబట్టి, మేమిద్దరం అండర్స్టాండింగ్ వచ్చేస్తాము.
వర్ష :అలా గొడవ జరిగినప్పుడు తేజు ఎవరికైనా వార్నింగ్ ఇచ్చిందా..
తేజు : ఆ ఇచ్చాను అంటే జస్ట్ మిస్ అండర్స్టాండింగ్. ఒక ప్రాబ్లం వల్ల ఇరుక్కోవడంతో తప్పు చేయకపోయినా ఆ సిచువేషన్ దగ్గరికి వెళ్లే లోపు అమరుని బయటికి తీసుకొచ్చేశాను. అక్కడదాకా వెళ్ళిన రీజన్ ఒక పర్సన్ వల్ల కాబట్టి ఆ పర్సన్కి ఫోన్ చేసి, నేను ఫ్రెండ్ అనుకుంటే మీరు ఇక్కడిదా తీసుకెళ్లారు. అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. అది విన్న వర్షా అమర్ జోలికి వస్తే తేజు వదిలేలా లేదుగా గట్టిగా ఇచ్చేలా ఉంది. నువ్వు గొడవ పడవేమో అని అందరూ అంటారు. కానీ ఎందుకు గొడవ పడను కోపం ఖచ్చితంగా వస్తుంది నాకు. కానీ కంట్రోల్ చేసుకుంటా, నీ కన్నా ఎక్కువ అమర్కే పేషెన్సి ఉంది కదా, అంతలేదు అంటుంది తేజు.అమర్ కి కోపం కంట్రోల్ చేసుకునేంత సీన్ లేదు అని అంటుంది.