Virat Kohli – Rohit Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ లన్ని చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే దాదాపు 36 మ్యాచులు ఈ టోర్నమెంట్లో పూర్తయ్యాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో.. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అలాగే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని ఉద్దేశించి… సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మ కెప్టెన్సీ గొప్పదంటూ… నెటిజెన్స్ వీడియోలు పోస్టులు చేస్తున్నారు. ఈ సీజన్లో రోహిత్ శర్మ… హార్దిక్ పాండ్యాకు సలహాలు ఇచ్చి ముంబై ఇండియన్స్ విజయం సాధించేలా… చర్యలు తీసుకుంటున్నాడని కామెంట్ చేస్తున్నారు.
Also Read: Hasan Ali on Abrar : PSLలో మరో అరాచకం.. వికెట్ తీసి హసన్ అలీ ఏం చేసాడో చూడండి
విరాట్ కోహ్లీ చెత్త ఐడియాలు
అదే సమయంలో.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు చెత్త సూచనలు.. ఆ జట్టును విరాట్ కోహ్లీ నాశనం చేస్తున్నాడని… పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సిబి మ్యాచ్ వీడియోలు వైరల్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో బెంగళూరు బౌలర్ సుయాస్ శర్మకు… విరాట్ కోహ్లీ సలహాలు ఇచ్చాడు. అయితే రాయల్ చాలెంజర్స్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కనుక… రజిత్ పటీదార్ కూడా… ఫుల్ పవర్స్ ఇచ్చాడు. దీంతో గ్రౌండ్లో రెచ్చిపోయిన విరాట్ కోహ్లీ అందరూ బౌలర్లకు సలహాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా సుహాస్ శర్మకు… సలహాలు ఇచ్చాడు విరాట్ కోహ్లీ. ఈ సందర్భంగా… విరాట్ కోహ్లీ (Virat Kohli ) పైన అభిమానంతో సలహాలు పాటించి సుయాస్ శర్మ… పాటించాడు. కానీ ప్లాన్ బేడిసి కొట్టింది. ప్రత్యర్థి బ్యాటర్ సిక్స్ అలాగే బౌండరీ కొట్టాడు. దీంతో విరాట్ కోహ్లీ పైన దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది.
ముంబైకి బంగారు బాతులాంటి రోహిత్ శర్మ
ముంబై ఇండియన్స్ జట్టులో పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇచ్చిన సలహాలు హార్దిక్ పాండ్యా కూడా పాటిస్తూ ఉన్నాడు. టీమిండియా కెప్టెన్ గా సక్సెస్ఫుల్ అయిన రోహిత్ శర్మ… ముంబై ఇండియన్స్ కు కూడా అనేక సలహాలు ఇస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే ఈసారి.. ముంబై ఇండియన్స్ వరుసగా విజయాలతో దూసుకు వెళ్తోంది. బ్యాట్స్మెన్ గా రోహిత్ శర్మ విఫలమైనప్పటికీ… అతని సలహాలు మాత్రం ముంబై ఇండియన్స్ కు బాగా పనికి వస్తున్నాయి. ఇప్పుడు ఇదే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కు… కోపం తెప్పిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా…. గతంలో కంటే ఈసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుతంగా రాణిస్తోంది. విరాట్ కోహ్లీ పెద్దగా రాణించినప్పటికీ… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్స్ అద్భుతంగా రాణిస్తున్నారు. అటు ముంబై ఇండియన్స్ మాత్రం మొదట వరుసగా ఓటమిపాలై ఇప్పుడిప్పుడే గాడిలా పడుతుంది. ఇలాగే వరుసగా విజయాలను నమోదు చేస్తే ప్లే ఆఫ్ కు వెళ్లడం గ్యారంటీ.
Two leaders giving tips.🤡💀
pic.twitter.com/iESHI6nYWL— Gems of Cricket (@GemsOfCrickets) April 19, 2025