EdCIL India Limited Recruitment: ఏపీ రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంఏ, సైకాలజీలో ఎంఎస్సీ, డిప్లొమా పాసై ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అనే చెప్పవచ్చు. ఎడ్‌సిల్ ఇండియా లిమిటెడ్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు గౌరవ ప్రదమైన జీతం కూడా ఉంటుంది. సొంత రాష్ట్రంలో ఉద్యోగం చేసే అవకాశ వచ్చింది. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
నోట్: రేపే లాస్ట్ డేట్
ఎడ్‌సిల్ ఇండియా లిమిటెడ్ (EdCIL (India) Limited) లో కాంట్రాక్ట్ విధానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 మండలాల్లో కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఏప్రిల్ 20 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 103
ఎడ్‌సిల్ ఇండియా లిమిటెడ్ (EdCIL (India) Limited) లో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 20
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంఏ, సైకాలజీ ఎమ్మెస్సీ, డిప్లొమా పాసైన అభ్యర్థులు ఈ జాబ్స్ దరఖాస్తు చేసుకోండి.
వయస్సు: 2025 మార్చి 31 నాటికి 45 ఏళ్లు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. బీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఉద్యోగ ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
వేతనం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు గౌరవప్రదమైన జీతం ఉంటుంది. నెలకు రూ.30 వేల జీతం కల్పిస్తారు. అర్హత ఉండి ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకోండి.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://edcilindia.co.in/TCareers
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు గౌరవప్రదమైన జీతం ఉంటుంది. నెలకు రూ.30 వేల జీత కల్పిస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం అభ్యర్థుల్లారా.. సొంత రాష్ట్రంలో ఉద్యోగం చేసుకునే అవకాశం వచ్చింది. వెంటనే ఈ జాబ్స్ కోసం దరఖాస్తు పెట్టుకోండి. జస్ట్ ఇంటర్వ్యూ ద్వారానే ఉద్యోగం సాధించవచ్చు. ఆల్ ది బెస్ట్.
Also Read: CSIR-NGRI: ఇంటర్ పాసైతే చాలు.. మన హైదరాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగం.. జీతమైతే నెలకు రూ. రూ.38,483
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 103
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 20
విద్యార్హత: డిగ్రీ, డిప్లొమా, ఎంఏ