Endowment Department jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఈ, బీటెక్ పాసైన విద్యార్థులకు ఇది మంచి అవకాశం. మంచి వేతనంతో ఏపీ దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్ చెప్పవచ్చు. దేవాదాయ శాఖ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 70
ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 35 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(సివిల్), 5 ఏఈఈ (ఎలక్ట్రికల్), 30 టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
విద్యార్హత: ఏఈఈ ఉద్యోగాలకు సంబంధిత కేటగిరిలో బీఈ, బీటెక్ పాసై ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఇంజినీరింగ్ డిప్లొమా పాసైన వారిని అర్హులు.
ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
పరీక్ష వంద మార్కులకు గానూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హిందూ మతస్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
వయస్సు: వయస్సుకి సంబంధించి 42 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అయిదేళ్ల సడలింపు ఉంది.
జీతం: నెలకు ఏఈఈ ఉద్యోగాలకు రూ.35,000, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అయితే నెలకు రూ.25000తో పాటు అదనపు అలవెన్సు చెల్లిస్తారు.
Also Read: UCO Bank Jobs: ఈ ఉద్యోగం కొడితే లైఫ్ సెట్ భయ్యా.. భారీ వేతనం..
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తుకు చివరి తేది: జనవరి 5