Machilipatnam Crime: ఏపీలో మహిళలు, బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే చాలు, పోలీసులు వారి స్టైల్ లో చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా మచిలీపట్నంలో మైనర్ బాలికపై అత్యాచార ఘటన జరగగా, పోలీసులు సీరియస్ యాక్షన్ లోకి దిగారు. ప్రభుత్వం సైతం వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని ఆదేశించింది. రహదారి గుండా వెళ్తున్న మైనర్ బాలికపై, నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడడంతో పోలీసులు వారిని అరెస్టు చేసిన ఘటన మచిలీపట్నంలో జరిగింది. మచిలీపట్నం డీఎస్పీ అబ్దుల్ సుభాన్ కేసుకు సంబంధించిన వివరాలను తెలిపారు.
డీఎస్పీ తెలిపిన విరాల మేరకు ఈనెల 27వ తేదీన రాత్రి ఏడున్నర గంటల సమయంలో మచిలీపట్నం లోని పంపుల చెరువు కట్ట వెనుక ఉన్న వాటర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గరలో 13 సంవత్సరాల మైనర్ బాలిక వెళ్తుండగా, మహమ్మద్ తలేహా, సాదం బాల శంకర్ సాయి లు బాలికను అడ్డగించారు. గట్టిగా కేకలు వేస్తే చంపేస్తామని బెదిరించి మోటార్ సైకిల్ పై గ్రామానికి దగ్గరలోని ఖాళీ ప్రదేశంకు తీసుకెళ్లారు. అక్కడ అప్పటికే మాటు వేసి ఉన్న అశోక్, వేముల వెంకట పవన్ లు కలిసి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడడంతో బాలిక కేకలు వేస్తూ ఇంటి వైపుకు పరుగులు తీసింది.
అసలు విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలపగా, తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీస్ బృందాలు నిందితుల కోసం గాలించి చిట్టచివరకు వారిని ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరు పరచగా, 14 రోజుల రిమాండ్ విధించినట్లు డీఎస్పీ సుభాన్ తెలిపారు. మహిళల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు.
Also Read: Seetharam Thammineni: జనసేనలోకి తమ్మినేని? బొత్స భేటి.. పార్టీ మార్పుపై క్లారిటీ!
ఇప్పటికే కళాశాలలు, పాఠశాలలకు పోలీసులు వెళ్లి విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. అత్యాచార ఘటనలకు పాల్పడిన వారు ఎవరైనా సరే, చట్టరీత్యా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. మచిలీపట్నం ఏరియాలో పోలీసుల పెట్రోలింగ్ సైతం విస్తృతం చేసినట్లు, బహిరంగ ప్రదేశాలలో ఎవరైనా మద్యం సేవిస్తే చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు.
మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో నిందితులు అరెస్ట్
నలుగురు నిందితులను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలు తెలిపిన డీఎస్పీ అబ్దుల్ సుభాన్
ఈ నెల 27వ తేదీ సాయంత్రం 13 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్
మైనర్ బాలికను బలవంతంగా బైక్పై తీసుకువెళ్లిన మహ్మద్, బాల శంకర్ సాయి… https://t.co/Dkt3Gbf1Hb pic.twitter.com/QxUCMDGl2N
— BIG TV Breaking News (@bigtvtelugu) December 29, 2024