Indiramma Housing Scheme: ఆమె దివ్యాంగురాలు. ఎన్నో ఏళ్ల నుండి సొంతిల్లు లేక ఇబ్బందులు పడుతోంది. అద్దె భవనంలో కాలం వెళ్లదీస్తోంది. ఎవరో చెప్పారు ఆమెకు. ప్రభుత్వం ఇందిరమ్మ గృహాలు మంజూరు చేస్తుందని, దరఖాస్తు చేసుకోమని కొందరు సలహా ఇచ్చారు. తనకు రాజకీయ పలుకుబడి లేదు. ఎవరూ తెలియదు. ఎలాగోలా దరఖాస్తు చేసుకుంది. అబ్బో.. అప్లై చేసిన వెంటనే ఇల్లు వస్తుందా నీకు.. ఇవి కొందరి మాటలు. ఆ మాటలు విన్న ఆ దివ్యాంగురాలు ఆశలు కూడ వదులుకుంది. అప్పుడే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన ఓ మాటను కొందరు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. అర్హత ఒక్కటే ప్రామాణికంగా లబ్దిదారులను ఎంపిక చేస్తామని సీఎం ప్రకటించారని, నీకు తప్పక ఇందిరమ్మ ఇల్లు వస్తుందని కొందరు ఆమెకు అభయమిచ్చారు. చివరకు ఏం జరిగిందంటే..?
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడిమద్దికుంట గ్రామంలో దివ్యాంగురాలు వాలకట్ల భూమమ్మ నివసిస్తోంది. ఈ మహిళకు సొంతింటి కల నెరవేర్చుకోవాలని ఎప్పటినుండో కల. ఆ కల కలగానే మిగిలింది. ఇంతలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ గృహాలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు ముందుగా పేద కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. గృహాల మంజూరులో పారదర్శకత పాటించక పోతే, చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు.
ఆదశలో అధికారులు గృహాల మంజూరుకు లబ్దిదారులను ఎంపిక చేయడంలో ఎలాంటి ఆరోపణలు రాకుండ ప్రత్యేక శ్రద్ద చూపారు. ఇలా లబ్దిదారుల ప్రక్రియ సాగుతున్నప్పుడే, బీఆర్ఎస్ మాత్రం విమర్శలు సాగించింది. అసలైన లబ్దిదారులకు అన్యాయం జరుగుతుందని, ఇందిరమ్మ గృహాలు లేవు.. ఏమి లేవు.. అంతా డొల్ల అంటూ ప్రచారం సాగించింది. కానీ ప్రభుత్వం మాత్రం తనపని తాను చేసుకుపోయింది. ఎక్కడ కూడ విమర్శలకు తావులేకుండ, లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ సాగించింది. అందుకే ఉదాహరణే దివ్యాంగురాలు భూమమ్మకు ఇందిరమ్మ గృహం మంజూరు కావడం అంటున్నారు కాంగ్రెస్ నాయకులు.
భూమమ్మకు రాజకీయ పలుకుబడి లేదు. కానీ అర్హత ప్రకారం ఆమెకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావాలి. ఇక్కడ కూడ అదే జరిగింది. ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు పారదర్శకత పాటించారు. భూమమ్మకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఇల్లు మంజూరు గురించి తెలుసుకొనేందుకు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లిన భూమమ్మ, జాబితాలో తన పేరు ఉండడంతో ఆమె కంటి ద్వార ఆనందభాష్పాలు రాల్చింది.
Also Read: Sangareddy: సంగారెడ్డిలో దారుణం.. కన్నబిడ్డను హతమార్చిన తండ్రి
ఈ దృశ్యం చూసిన స్థానిక ప్రజలు.. ఎన్నో ఏళ్లుగా భూమమ్మ సొంతింటి కల కలగానే మిగిలిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆమె కోరిక నెరవేరిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా మాది ఇందిరమ్మ రాజ్యం.. ఇక్కడ రాజకీయాలు కాదు.. కేవలం అర్హత ఉంటే చాలు.. ప్రభుత్వ పథకాలతో లబ్ది ఖాయం అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. ఎంతైనా అది కూడ నిజమని చెప్పాల్సిందే.. ఎందుకంటే భూమమ్మ లాంటి ఎందరికో ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కదా!
ఇది కదా సామాన్యులు, పేదలు కోరుకున్న ప్రజాపాలన
పేదలకు, అర్హులకు పట్టం కడుతున్న సీఎం రేవంత్ రెడ్డి
ఇందిరమ్మ ఇల్లు మంజూరులో తన పేరు ఉందనే సంతోషంలో మహిళ ఆనందభాష్పాలు
వికలాంగ లబ్ధిదారురాలు వాలకట్ల భూమమ్మ (రేగడిమద్దికుంట గ్రామము, సుల్తానాబాద్ మండలం) భావోద్వేగం
పారదర్శకంగా,… https://t.co/vHftbM2FFg pic.twitter.com/WlfeoJfLqz
— BIG TV Breaking News (@bigtvtelugu) January 21, 2025