APPSC Group-1 Exams: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) కీలక అప్డేట్ ఇచ్చింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. మే 3 నుంచి 9 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపింది. అయితే మెయిన్ పరీక్షా పేపర్లను ట్యాబుల్లో ఇవ్వాలని నిర్ణయించినట్టు ఏపీపీఎస్సీ అధికారులు ఇప్పటికే వెల్లడించారు.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను డిస్క్రిప్టివ్ టైప్‌లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 81
ఏపీపీఎస్సీ మొత్తం 81 గ్రూప్-1 పోస్టుల భర్తీ చేసేందుకు గానూ 2024 మార్చి 17న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 1,48,881 మంది ప్రిలిమ్స్‌కు దరఖాస్తు చేసుకోగా, 4,496 మంది మెయిన్స్‌కు అర్హత సాధించినట్లు ఏపీపీఎస్సీ అధికారులు వెల్లడించారు.
పరీక్ష తేదీలివే..
మే3– క్వాలిఫైయింగ్ ఎగ్జామ్(తెలుగు)
మే 4 – క్వాలిఫైయింగ్ ఎగ్జామ్(ఇంగ్లీష్)
మే 5 – పేపర్ 1(జనరల్ ఎస్సే)
మే 6 – పేపర్ 2(ఇండియా, ఏపీ చరిత్ర, సంస్కృతి, భూగోళశాస్త్రం)
మే 7 – పేపర్ 3( పాలిటీ)
మే 8 – పేపర్ 4( ఇండియా, ఏపీ ఎకానమి)
మే 9 – పేపర్ 5(సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇష్యూస్)
Also Read: TGPSC Group-II: అఫీషియల్ KEY తర్వాత గ్రూప్-2 కటాఫ్ ఇదిగో.. సేఫ్ మార్కులివే..
మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థులు ప్లాన్ ప్రకారం చదువుకుంటే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. మెయిన్స్ పరీక్షలకు ఇంకా 100 రోజుల సమయం ఉంది. ఎవరైతే ఈ వంద రోజులను ప్రిపరేషన్‌కు సరిగ్గా వినియోగించుకుంటారో వారికి జాబ్ వచ్చే అవకాశాలున్నాయి. బాగా చదవండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.