BigTV English
Advertisement

Agniveer Recruitment: ఎనిమిది, పదో తరగతి అర్హతతో భారీగా అగ్నివీర్ జాబ్స్.. నోటిఫికేషన్ వచ్చేసింది.. జీతం రూ.30,000

Agniveer Recruitment: ఎనిమిది, పదో తరగతి అర్హతతో భారీగా అగ్నివీర్ జాబ్స్.. నోటిఫికేషన్ వచ్చేసింది.. జీతం రూ.30,000

Agniveer Recruitment: ఇండియన్ ఆర్మీలో పని చేయడం మీ లక్ష్యమా..? అయితే మీరు ఎనిమిదో తరగతి, పదో తరగతి పాసై ఉన్న అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం అనే చెప్పవచ్చు. దేశ వ్యాప్తంగా అగ్నివీర్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు అందరూ ఏప్రిల్ 10 లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.


ఎగ్జామ్, ఫిజికల్ టెస్టులతో ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. అవకాశం ఉన్న వారు శిక్షణతో కలిపి నాలుగేళ్ల ఆర్మీలో పని చేయవచ్చు. అయితే నాలుగేళ్ల తర్వాత ఉత్తమ ప్రతిభ కనబరిచినవారిలో 25 శాతం మందిని పర్మినెంట్ ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఎంపికైన వారు 15 ఏళ్లు ఉద్యోగంలో కొనసాగుతారు. మిగిలిన అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం, స్కిల్ సర్టిఫికెట్ అందుతాయి.

ఏపీ అభ్యర్థులకు గుంటూరు, వైజాగ్, తెలంగాణ అభ్యర్థులకు ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్, సికింద్రాబాద్ లో నియామక కేంద్రాల ఆధ్వర్యంలో పరీక్షలు, ఫిజికల్ టెస్టులు నిర్వహించనున్నారు.


ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ముందు ఆన్ లైన్ లో ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఇందులో టాలెంట్ చూపినవారికి ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తారు. తాజా నోటిఫికేషన్‌ ద్వారా అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ, అగ్నివీర్‌ టెక్నికల్, అగ్నివీర్‌ క్లర్క్‌/ స్టోర్‌ కీపర్‌ టెక్నికల్, అగ్నివీర్‌ ట్రేడ్స్‌మెన్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

పోస్టులు.. వాటికి కావాల్సిన అర్హతలు: 

అగ్రివీర్ జనరల్ డ్యూటీ: 45 శాతం మార్కులతో టెన్త్ పాసై ఉండాలి. అలాగే ప్రతి సబ్జెక్టులోనూ 33 శాతం మార్కులు పొందాలి. లైట్‌ మోటార్‌ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్నవారికి డ్రైవర్‌ పోస్టులకు ప్రాధాన్యం ఉంటుంది. ఎత్తు 166 సెం.మీ. ఉండాలి.

అగ్నివీర్ టెక్నికల్: ఇంటర్ పాసై ఉండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు అర్హులు. ప్రతి సబ్జెక్టులోనూ 40 శాతం, మొత్తం మీద 50 శాతం మార్కులు పొందాలి. లేదా టెన్త్ క్లాస్ లో ప్రతి సబ్జెక్టులోనూ 40 శాతం, మొత్తం మీద 50 శాతం మార్కులతో పాటు నిర్దేశిత ట్రేడ్‌/బ్రాంచీల్లో రెండేళ్ల ఐటీఐ లేదా మూడేళ్ల డిప్లొమా కోర్సు పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎత్తు 165 సెం.మీ. ఉండాలి.

అగ్నివీర్ క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్:  ఏ గ్రూపుతోనైనా ఇంటర్‌లో 60 శాతం మార్కులు పొందినవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ప్రతి సబ్జెక్టులోనూ కనీసం 50 శాతం వస్తే సరిపోతుంది. ఇంగ్లిష్, మ్యాథ్స్‌/ అకౌంట్స్‌/ బుక్‌ కీపింగ్‌లో 50 శాతం మార్కులు ఉండాలి. ఎత్తు 162 సెం.మీ. ఉండాలి.

అగ్రివీర్ ట్రేడ్స్ మెన్: టెన్త్ క్లాస్ పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి సబ్జెక్టులోనూ 33 శాతం మార్కులు ఉండాలి. ఎత్తు 166 సెం.మీ. అవసరం.

అగ్నివీర్ ట్రేడ్స్ మెన్: ఎనిమిదో తరగతి . ప్రతి సబ్జెక్టులోనూ 33 శాతం మార్కులు తప్పనిసరి. ఎత్తు 166 సెం.మీ. ఉండాలి.

దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 10

వయస్సు: ఇందులో అన్ని ఉద్యోగాలకు 17 1/2 ఏళ్ల నుంచి 21 ఏళ్లలోపు మధ్య వయస్సు ఉండాలి. 2004 అక్టోబర్ 1 నుంచి 2008 ఏప్రిల్ 1 మధ్య జన్మించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని పోస్టులకు ఎత్తుకు తగ్గ బరువు అవసరం. ఛాతీ విస్తీర్ణం 77 సెం.మీ. ఉండాలి. సర్వీస్‌మెన్, ఎక్స్‌ సర్వీస్‌మెన్, వార్‌ విడో పిల్లలకు మినహాయింపులు ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 10

ఫీజు: రూ.250 ఉంటుంది.

ఎగ్జామ్ డేట్స్: జూన్ లో ఉండొచ్చు.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://joinindianarmy.nic.in/

ఫిజికల్ టెస్టులు: అన్ని పోస్టులకూ ఫిజికల్‌ టెస్టులో కచ్చితంగా పాస్ అవ్వాలి. ఇందులో భాగంగా 1600 మీటర్ల దూరాన్ని 5 నిమిషాల 30 సెకన్లలో పూర్తిచేస్తే 60 మార్కులు, 5 నిమిషాల 31 సెకన్ల నుంచి 5 నిమిషాల 45 సెకన్ల లోపు పూర్తిచేస్తే 48 మార్కులు ఇస్తారు. 6 నిమిషాల్లోపు చేరుకుంటే 36, 6 నిమిషాల 15 సెకెన్లలోపు అయితే 24 మార్కులు పొందుతారు. కనీసం 6 పుల్‌అప్స్‌ తీయాలి. 6 తీసినవారికి 16, 7 తీస్తే 21, 8కి 27, 9కి 33, 10 తీస్తే 40 మార్కులు పొందవచ్చు. 9 అడుగుల దూరానికి దూకగలిగితే అర్హత సాధిస్తారు. జిగ్‌జాగ్‌ బ్యాలెన్స్‌లో అర్హత సాధించాలి. అనంతరం ఫిజికల్‌ మెజర్‌మెంట్, అడాప్టబిలిటీ, మెడికల్‌ టెస్టులు ఉంటాయి. వీటన్నింటిలో విజయవంతమైతే శిక్షణకు తీసుకుంటారు.

జీతం: ఎంపికైన మొదటి సంవత్సరం నెలకు రూ.30,000 రెండో ఏడాది రూ.33,000 మూడో సంవత్సరం రూ.36,500 నాలుగో ఏట రూ.40,000 చెల్లిస్తారు. ప్రతి నెలా అందుకునే మొత్తంలో 30 శాతం కార్పస్‌ ఫండ్‌కి జమ చేస్తారు. నాలుగేళ్ల వ్యవధికి సేవానిధిలో రూ.5.02 లక్షలు అగ్నివీరుని నుంచి జమఅవుతోంది.  అంతే మొత్తాన్ని ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. రెండూ కలిసి రూ.10.04 లక్షలవుతాయి. దీనికి వడ్డీ జతచేసి అగ్నివీరుని అకౌంట్ కు పంపుతారు.

ALSO READ: DIBT Recruitment: గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ.37వేల జీతం.. పూర్తి వివరాలివే

ALSO READ: DFCCIL Recruitment: టెన్త్ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. మంచి వేతనం.. దరఖాస్తుకు ఇంకా వారం రోజులే

Related News

IRCTC Recruitment 2025: IRCTCలో హాస్పిటాలిటీ మానిటర్ పోస్టులు, ఆ డిగ్రీ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి!

NABARD Notification: నిరుద్యోగులకు శుభవార్త.. నాబార్డులో ఆఫీసర్స్ ఉద్యోగాలు.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు

BEML Notification: భారత్ ఎర్త్ మూవర్స్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.40000.. ఇంకెందుకు ఆలస్యం

NSUT Notification: నేతాజీ సుభాష్ యూనివర్సిటీలో 184 ఉద్యోగాలు.. రూ.2లక్షలకు పైగా జీతం, పూర్తి వివరాలివే..

BRO Notification: టెన్త్ క్లాస్ అర్హతతో భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. జీతమైతే అక్షరాల రూ.63,200.. ఇంకెందుకు ఆలస్యం

SBI Notification: డిగ్రీ అర్హతతో స్పెషలిస్ట్ ఉద్యోగాలు.. ఇలాంటి నోటిఫికేషన్ రేర్, జాబ్ వస్తే లైఫ్ అంతా సెట్

RITES Notification: డిగ్రీ, డిప్లొమా అర్హతతో భారీగా జాబ్స్.. ఉద్యోగ ఎంపిక విధానమిదే, ఇంకా వారం రోజులే

ISRO: ఇస్రోలో ఉద్యోగాలు.. రూ.1,77,500 జీతం, టెన్త్, డిగ్రీ పాసైతే చాలు

Big Stories

×