BigTV English

Nayanthara: స్టూడియో స్టైల్ లో నయనతార కొత్త ఇల్లు.. ధర తెలిస్తే గుండె గుభేల్..!

Nayanthara: స్టూడియో స్టైల్ లో నయనతార కొత్త ఇల్లు.. ధర తెలిస్తే గుండె గుభేల్..!

Nayanthara:లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇండస్ట్రీకి వచ్చి 19 సంవత్సరాలకు పైగానే అవుతున్నా.. ఇప్పటికీ తన అందంతో, నటనతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్గా చలామణి అవుతూ.. ఒక్క సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా భారీ విజయాలను అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద స్టార్ హీరోలుగా కొనసాగుతున్న రజినీకాంత్(Rajinikanth ), చిరంజీవి (Chiranjeevi), ఎన్టీఆర్ (NTR) , షారుక్ ఖాన్ (Shahrukh Khan), నాగార్జున(Nagarjuna ) వంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసిన ఈమె.. 2015 లో “నానుం రౌడీ ధాన్” అనే సినిమా సెట్ లో దర్శకుడు విగ్నేష్ శివన్ ను (Vighnesh Shivan) ను కలిసి, 2022లో అతడిని వివాహం చేసుకుంది..ఇక పెళ్లి తర్వాత ఇద్దరు మగ కవల పిల్లలకు సరోగసి ద్వారా జన్మనిచ్చిన విషయం తెలిసిందే.


కొత్త ఇల్లు కొనుగోలు చేసిన నయనతార, విఘ్నేష్ శివన్ జంట..

భర్తతో కలిసి ‘రౌడీ పిక్చర్స్’ అనే నిర్మాణ సంస్థను స్థాపించిన ఈమె ..తన భర్త విఘ్నేష్ శివన్ తాజాగా దర్శకత్వం వహిస్తున్న “లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ” చిత్రానికి నిర్మాతగా మారింది. ఇదిలా ఉండగా ఒకవైపు సినిమాలు.. మరొకవైపు బిజినెస్ అంటూ దూసుకుపోతున్న ఈ జంట.. తాజాగా ఒక కొత్త ఇంటిని కొనుగోలు చేశారు. చెన్నైలోని పోయెస్ గార్డెన్ లో ఒక కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. ఈ ఇంటి విశేషం ఏమిటంటే.. ఇప్పుడు ఈ ఇంటిని స్టూడియో గా మార్చారు. ఈ ఇంటి విస్తీర్ణం సుమారుగా 7000 చదరపు అడుగులు ఉంటుందని సమాచారం.


స్టూడియో ప్రత్యేకతలు ఇవే..

ఈ స్టూడియో ప్రత్యేకతల విషయానికి వస్తే..హస్తకళలు, వెరైటీ డిజైన్లు, కొత్త డిజైన్లతో రూపొందించారు. ముఖ్యంగా ఈ స్టూడియో తరహా ఇంట్లో అందమైన గాజు కిటికీలు, అత్యద్భుతమైన చెట్లు కూడా ఉన్నాయి. ఇక ఈ ఇంటి విలువ సుమారుగా రూ.100 కోట్లకు పైగా ఉంటుందని విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం విఘ్నేష్ శివన్, నయనతార దంపతుల కొత్త ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఇప్పుడు ఇంటి తరహా స్టూడియో ప్రత్యేకతలు చూసి నెటిజన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు.

నయనతార సినిమాలు..

ఇక నయనతార విషయానికి వస్తే.. చివరిగా ‘అన్నపూర్ణి’ ఉంది అనే చిత్రంలో నటించింది. 2023లో ఈ సినిమా విడుదల కాగా, గత ఏడాది ఈమె నుంచి ఒక సినిమా కూడా విడుదల కాలేదు. ఇక ప్రస్తుతం సుందర్ సి (Sundar.C) దర్శకత్వం వహిస్తున్న తమిళ చిత్రం ‘మూకుత్తి అమ్మన్’ సినిమా సీక్వెల్ ‘మూకుత్తి అమ్మన్2’ లో నటిస్తోంది.ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఇక్కడ ఆశ్చర్యకర విషయమేమిటంటే తొలిసారి ఒక సినిమా పూజా కార్యక్రమాలలో నయనతార పాల్గొని అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రంతోపాటు టాక్సిక్, డియర్ స్టూడెంట్స్, మన్నంకట్టి, రాకాయ్ వంటి చిత్రాలలో నటిస్తోంది. వీటితోపాటు టెస్ట్ అనే సినిమాలో కూడా నటిస్తూ ఉండగా ఇది ఏప్రిల్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శశికాంత్ (Sasikanth) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆర్. మాధవన్(R.Madhavan), సిద్ధార్థ్(Siddharth)కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Abhinaya: ఎట్టకేలకు కాబోయే వాడిని పరిచయం చేసిన అభినయ.. అతడి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..?

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×