BigTV English

Suriya: పెద్ద మనసు చాటుకున్న సూర్య.. సినిమా ఫ్లాప్ అయినా వారికి సాయం..

Suriya: పెద్ద మనసు చాటుకున్న సూర్య.. సినిమా ఫ్లాప్ అయినా వారికి సాయం..

Suriya: ఒక సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా దాంతో హీరోకు పెద్దగా సంబంధం ఉండదు. ముఖ్యంగా ఒక సినిమాలో నటించి అది డిశాస్టర్ అయితే నిర్మాత నష్టాల్లోకి వెళ్లిపోయినా చాలామంది హీరోలు పట్టించుకోరు. ఆ భారమంతా నిర్మాతలపైనే పడుతుంది. కానీ కొందరు హీరోలు మాత్రం తాము నటించిన చిత్రాలు ఫ్లాప్ అయితే ఆ భారాన్ని పంచుకోవడానికి ముందుకొస్తారు. అలాంటి పెద్ద మనసున్న హీరోల్లో సూర్య కూడా ఒకడు. అందుకే ఆన్ స్క్రీన్‌పై సూర్య యాక్టింగ్‌తో పాటు ఆఫ్ స్క్రీన్ తన యాటిట్యూడ్ అంటే కూడా చాలామందికి ఇష్టం. తాజాగా ‘కంగువా’ మేకర్స్‌ను ఆర్థికంగా ఆదుకోవడానికి సూర్య ముందుకొచ్చాడని కోలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి.


ఆ సినిమా వల్లే

శివ దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న చిత్రమే ‘కంగువా’ (Kanguva). ఆ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కి భారీ అంచనాల మధ్య విడుదలయ్యింది. కానీ మూవీకి ఎంత ప్రమోషన్స్ చేసినా మొదటి రోజు నుండే ‘కంగువా’కు ఫ్లాప్ టాక్ రావడంతో రెండో రోజు నుండే ఈ సినిమాను థియేటర్లలో చూడడానికి ప్రేక్షకులు పెద్దగా రావడం మానేశారు. దీంతో డిశాస్టర్ టాక్‌తో పాటు కలెక్షన్స్ విషయంలో కూడా నష్టాలే చవిచూసింది ‘కంగువా’. అంతే కాకుండా ఎన్నో ఏళ్లుగా ఒక సినిమాకు ఇంత దారుణమైన కలెక్షన్స్ రావడం ఇదే మొదటిసారి అని కూడా ఇండస్ట్రీ నిపుణులు చర్చించుకున్నారు. ప్రస్తుతం ఆ సినిమా నిర్మాతలు నష్టాల్లో ఉండగా వారికి సాయం అందించడానికి సూర్య ముందుకొచ్చాడు.


అలాంటి అగ్రిమెంట్

‘కంగువా’ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించాడు జ్ఞానవేల్ రాజా. దానిని నిర్మించడం వల్లే ఇప్పుడు భారీగా నష్టాల్లో మునిగిపోయాడు. అందుకే ఇప్పుడు తన నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఎన్నో సినిమాలు ఆగిపోయే స్టేజ్‌కు వచ్చేశాయి. అందులో ఒకటి ‘వా వాతియారే’. ఈ మూవీని నలన్ కుమారసామి డైరెక్ట్ చేస్తుండగా ఇందులో సూర్య తమ్ముడు కార్తి హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యి చాలాకాలమే అయినా ఆర్థిక ఇబ్బందుల వల్ల విడుదల కావడం లేదు. అందుకే జ్ఞానవేల్ రాజాను సపోర్ట్ చేయడం కోసం సూర్య రంగంలోకి దిగనున్నట్టు సమాచారం. ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాలు పూర్తయిన తర్వాత జ్ఞానవేల్ రాజా ప్రొడక్షన్‌లోనే మరో రెండు సినిమాల్లో హీరోగా నటించడానికి సూర్య ఒప్పుకున్నాడు.

Also Read: క్యాన్సర్‌తో బాధపడుతున్న మెగాస్టార్.. ఎట్టకేలకు స్పందించిన టీమ్.!

కమ్ బ్యాక్ కావాలి

ప్రస్తుతం తమిళ దర్శకులు మాత్రమే కాదు.. పలు తెలుగు, మలయాళ దర్శకులతో కూడా చర్చలు జరుపుతున్నాడు సూర్య (Suriya). ‘కంగువా’ మేకర్స్‌తో సూర్య మరో రెండు సినిమాలు చేయనున్న విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ స్టేజ్‌ను దాటి సూర్య తన కమ్ బ్యాక్ ఎప్పుడెప్పుడు ఇస్తాడా అని ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించిన ‘రెట్రో’ మూవీ మే 1న విడుదలకు సిద్ధమయ్యింది. ఇందులో సూర్య ఒక గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలయిన ప్రతీ అప్డేట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×