E-Paper
Advertisement

రైలు సీట్లు నీలం రంగులోనే ఎందుకు ఉంటాయి? దీని వెనుక ఆసక్తికర కారణాలివే!

రైలు సీట్లు నీలం రంగులోనే ఎందుకు ఉంటాయి? దీని వెనుక ఆసక్తికర కారణాలివే!
Advertisement

Railway Blue Seats Mystery: సాధారణంగా రైల్వేలో ఓ విషయం ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అదే సీట్ల కలర్. 2AC, 3AC, స్లీపర్, జనరల్ ఇలా ఏ కోచ్ తీసుకున్న మెజారిటీ రైళ్లల్లో సీట్లు నీలం రంగులోని దర్శనమిస్తుంటాయి. నలుపు, తెలుపు, ఎరుపు, పసుపు ఇలా ఎన్నో రంగులు ఉండగా.. ఒక్క నీలం రంగునే సీట్లకు ఎంచుకోవడం వెనుక లాజిక్ తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఆ ప్రశ్నలకు ఈ కథనంలో సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం.

నీలం.. ప్రశాంతతకు చిహ్నం

మనస్తత్వ శాస్త్రం ప్రకారం రంగులు కూడా వ్యక్తుల ఆలోచనలు, భావోద్వేగాలపై ప్రభావం చూపుతాయి. కలర్ సైకాలజీ ప్రకారం నీలం రంగు ప్రశాంతత, స్థిరత్వం, నమ్మకానికి ప్రతీకగా నిలుస్తుంది. ఆకాశం, సముద్రం వంటి ప్రకృతి అంశాలతో ముడిపడి ఉండటం వల్ల ఈ రంగు చూడగానే మనసుకు హాయిగా అనిపిస్తుంది. రైలు ప్రయాణం సాగించేటప్పుడు కోచ్ లోపలి వాతావరణం కంటికి ఆహ్లాదకరంగా ఉండాలనే ఉద్దేశంతో రైల్వే శాఖ నీలం రంగును ఎంచుకున్నట్లు చెబుతుంటారు.

దుమ్ము, మరకలు కనిపించకుండా..

Advertisement

ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో లగేజీ పెట్టడం, సీట్లు లేదా బెర్తులపైనే ఆహారం తీసుకోవడం వల్ల వాటిపై దుమ్ము, చిన్నపాటి మరకలు ఏర్పడుతుంటాయి. కాబట్టి సీట్లు ముదురు నీలం రంగులో ఉండటం వల్ల లేత రంగులతో పోలిస్తే వీటిపై మరకలు అంత త్వరగా బయటకు కనిపించవు.

ప్రయాణాల్లో అలసట కలగకుండా..

దేశంలో ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి రైలు ప్రయాణం చేయడానికి దాదాపు 15 నుండి 30 గంటలకు పైగానే సమయం పడుతుంది. ఇంత సుదీర్ఘ సమయం ప్రయాణికులు ఒకే కోచ్‌లో గడపాల్సి రావడం వల్ల ఏదోక సందర్భంలో అలసట సహజం. దీనికి చెక్ పెట్టేందుకు కూడా నీలం రంగు కాన్సెప్ట్ ఉపయోగపడుతోంది. నీలం రంగు కళ్లకు ఎలాంటి ఒత్తిడి కలిగించకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది.

మన్నిక పరంగా కూడా బెస్ట్..

Advertisement

రైళ్లలోని సీట్లు, బెర్త్ లను నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు వినియోగిస్తుంటారు. ఒకవేళ ఎరుపు, తెలుపు, బ్లూ వంటి నిండు రంగులతో సీట్లను తీర్చిదిద్దినట్లయితే అవి త్వరగానే వెలిసిపోయే ఛాన్స్ ఉంది. అదే ముదురు నీలం రంగును విషయంలో అలాంటి సమస్య ఉండదు. రంగు త్వరగా షేడ్ అవ్వకుండా ఎక్కువ కాలంపాటు మన్నికగా ఉంటుందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.

Also Read: రూ. 5 వేల పెట్టుబడి.. రూ.కోటి టర్నోవర్.. కప్‌కేక్స్‌తో యువతి గేమ్ ఛేంజింగ్ బిజినెస్!

ఆ రైళ్లల్లో నీలంకు మినహాయింపు

అయితే భారతీయ రైల్వేలోని అన్ని కోచ్‌లలో నీలం రంగు సీట్లు ఉండవని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రధానంగా ఐసీఎఫ్ (ICF) కోచ్‌లలో మాత్రమే ఇవి ఎక్కువగా కనిపిస్తాయని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న లేటెస్ట్ ఎల్‌హెచ్‌బీ (LHB) కోచ్‌లు, వందే భారత్ వంటి కొత్త తరం రైళ్లలో విభిన్న రంగుల సీట్లను ఉపయోగిస్తున్నారని పేర్కొంటున్నారు. రైలు రకం, ప్రయాణించే తరగతి (క్లాస్), కోచ్‌లో ఉండే ప్రత్యేక సదుపాయాలను బట్టి సీట్ల డిజైన్, రంగులు మారుతుంటాయని స్పష్టం చేస్తున్నారు.

Also Read: వందే భారత్ vs విమానం.. ప్రయాణికులకు ఇచ్చే ఫుడ్‌ పరంగా ఏది బెస్ట్? నెట్టింట ఆసక్తికర చర్చ!

Tags

Related News

సీతమ్మ ఊరి నుంచి రామయ్య అయోధ్యకు కొత్త రైలు.. ఇండియన్ రైల్వే గ్రీన్ సిగ్నల్!

రైలు ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్నారా? మీ కన్ఫర్మ్ టికెట్‌ ఇతరులకు బదిలీ చేయండి ఇలా

రైలు కిటికీలకు అద్దాలు ఉన్నా ఇనుప కడ్డీలు ఎందుకు? ఇదీ అసలు కథ!

వందే భారత్ vs విమానం.. ప్రయాణికులకు ఇచ్చే ఫుడ్‌ పరంగా ఏది బెస్ట్? నెట్టింట ఆసక్తికర చర్చ!

గంగానదిపై వాటర్ మెట్రో ప్రయాణం.. టికెట్ ధర జస్ట్ రూ.50!

విమానం రంగంలో చైనా దూకుడు.. ఎలక్ట్రిక్ విమానం తయారు, తొలి ప్రయోగం సక్సెస్

అఖండ భారత్ లో ఇన్ని దేశాలు ఉండేవా? పాకిస్తాన్ నుంచి శ్రీలంక వరకు ఆసక్తికర విశేషాలివే!

Big Stories

Advertisement
×