AP DSC Candidates: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తులు మొదలయ్యాయి. చాలాకాలంతో డీఎస్సీ రిక్రూట్‌మెంట్ ఓపెన్ చేయడంతో గట్టి పోటీ నెలకొంది. లక్షల్లో అభ్యర్థులు రాయవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కాకపోతే చాలామంది బీసీ, ఎస్టీ, ఎస్టీ అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. మెటీరియల్స్ లేకుండా సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీన్ని గమనించిన ప్రభుత్వం, ఆచార్య యాప్‌ని రంగంలోకి దించింది. దీనిద్వారా ఉచిత డీఎస్సీ కోచింగ్ అందిచనున్నారు. ఇక విధంగా చెప్పాలంటే డీఎస్సీ అభ్యర్థులకు ఇదొక తీపి కబురు అన్నమాట.
మంగళవారం అమరావతిలో బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత ‘ఆచార్య’ యాప్‌ను ప్రారంభించారు. బీసీ స్టడీ సర్కిల్ ద్వారా బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో ఉచితంగా డీఎస్సీ కోచింగ్ లభించనుంది. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి సవిత తెలిపారు.
ఈ యాప్‌ను శ్యామ్ ఇన్ స్టిట్యూట్ ద్వారా రూపొందించామని వెల్లడించారు. 24 గంటల పాటు ఉచిత శిక్షణ ఉంటుందని తెలిపారు. దీనివల్ల పైఅభ్యర్థులు ఆచార్య సేవలు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. రీసెంట్‌గా ఏప్రిల్ 20న డీఎస్సీ (16,347 టీచర్ పోస్టులకు) నోటిఫికేషన్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.
ఆఫ్‌లైన్ కోచింగ్‌కు చాలామంది వెళ్లలేని నెలకొంది. సుదూర ప్రాంతవాసులతోపాటు ఇతరులకు లబ్ధి చేకూర్చేలా ఆన్‌లైన్ కోచింగ్ ప్రారంభించినట్లు వెల్లడించారు మంత్రి సవిత. దరఖాస్తు చేసుకున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులందరికి ఉచితంగా కోచింగ్ అందజేస్తామన్నారు. ప్రస్తుతానికి 3,189 మంది దరఖాస్తులు వచ్చాయని, ఇంకా ఎంతమది దరఖాస్తు చేసుకున్నా వారందరికీ ఉచితంగా కోచింగ్ అందజేస్తామన్నారు.
ALSO READ: టెన్త్ క్లాస్ అర్హతతో మెట్రోలో ఉద్యోగాలు, జీతం రూ.59,000 భయ్యా
కాకినాడకు చెందిన శ్యామ్ ఇన్ స్టిట్యూట్ డీఎస్సీ పేరిట ఆన్‌లైన్ కోచింగ్ ఇవ్వనుంది. ఈ విషయాన్ని మంత్రి సవిత స్వయంగా వెల్లడించారు. ఇన్ స్టిట్యూట్ ఆచార్య పేరుతో యాప్‌ని రూపొందించినట్టు తెలిపారు. ఈ యాప్ 24 గంటలూ పని చేస్తుందన్నారు. అర్థంకాని కాన్సెప్టులను అభ్యర్థులు ఎన్నిసార్లు అయినా ఓపెన్ చేయవచ్చు. మెటీరియల్‌ని ఉపయోగించుకోవచ్చు.
ఆచార్య యాప్‌లో సీనియర్ అధ్యాపకుల బోధనలు, సబ్జెక్టులకు చెందిన మెటీరియళ్లు, పాత డీఎస్సీ క్వశ్చన్ పేపర్లు అందుబాటులో ఉంటాయి. యాప్ చార్ట్ బాక్స్ రూపొందించామని, అందులో సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు రైజ్ చేస్తే తక్షణమే సిబ్బంది సమాధానాలు ఇస్తారని తెలిపారు.
ఒకవేళ యాప్‌లో టెక్నికల్ సమస్యలు వచ్చినా పరిష్కారం అయ్యేలా టీమ్‌ని రెడీ చేశామన్నారు. ప్రతి జిల్లాకు ఇద్దరిని నియమించినట్లు వెల్లడించారు. ఆ ఇద్దరితో వాట్సాప్ గ్రూప్ రూపొందించామని, టెక్నికల్ సమస్యలుంటే ఆ గ్రూప్‌లో ప్రస్తావిస్తే వారు పరిష్కరిస్తారని తెలిపారు మంత్రి సవిత.
అధికారంలోకి రాగానే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ఎన్నికల ప్రచారంలో టీడీపీ హామీ ఇచ్చింది. అన్నట్టుగానే అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేశారు సీఎం చంద్రబాబు. డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు బీసీ అభ్యర్థులే సాధించాలన్న లక్ష్యంతో బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఉచిత కోచింగ్ సెంటర్లు ప్రారంభించింది. 26 జిల్లాల్లో బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్లు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు సదరు మంత్రి.