Balakrishna Akanda 2: నటసింహ నందమూరి బాలకృష్ణ (Natasimha Nandamuri Balakrishna) ఈ వయసులో కూడా వరుస యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొడుతూ దూసుకుపోతున్నారు. ఏడు పదుల వయసుకు చేరువలో ఉన్నప్పటికీ ఒకవైపు హీరోగా, మరొకవైపు రాజకీయ నాయకుడిగా చలామణి అవుతున్నారు. అంతేకాదు అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె (Unstoppable with NBK) వంటి టాక్ షోలకు హోస్టుగా కూడా వ్యవహరిస్తూ.. తనకంటూ ఒక క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇక ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా డాకు మహారాజ్ (Daaku Maharaj) అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈయన ఇప్పుడు అఖండ (Akhanda) సీక్వెల్ అఖండ 2 (Akhanda 2) సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇటీవలే బోయపాటి (Boyapati ) ఈ సినిమా షూటింగ్ ను మహాకుంభమేళా, ప్రయాగ్ రాజ్ లో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగు మరింత వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన అప్డేట్ వెలువడడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
జార్జియోలో అఖండ 2 సినిమా షూటింగ్..
అఖండ 2 సినిమా షూటింగ్ కి సంబంధించి ఇప్పటివరకు మహా కుంభమేళ తోపాటు హైదరాబాదులోని కొన్ని ఏరియాలలోమాత్రమే కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. అఖండ -2 చిత్రీకరణకు సంబంధించి ఇప్పటివరకు ఈ రెండు ప్రాంతాలలోనే షూటింగ్ జరిగింది. ఇంతవరకు అవుట్ డోర్ షూటింగ్ కి మాత్రం వెళ్ళలేదు. ఈ నేపథ్యంలోనే తదుపరి షెడ్యూల్ జార్జియోలో మొదలవుతుందని సమాచారం. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ ఘట్టాలు కూడా చిత్రీకరించనున్నారట. ఇందులో భాగంగానే వేలాది మంది అఘోరా గెటప్స్ లో ఆయా సన్నివేషాలలో కూడా పాల్గొంటారని కూడా సమాచారం.
ఖండాలు దాటుతున్న అఖండ 2 క్రేజ్..
ముఖ్యంగా జార్జియోలో ఒక భారీ ప్రదేశంలో ఈ సినిమా సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. యాక్షన్ సన్నివేశాలు అన్నీ కూడా ఈ జార్జియో బ్యాక్ డ్రాప్ లోనే ఉంటాయని, హిందుత్వం కాన్సెప్ట్ కావడంతో పాన్ ఇండియాలో ఈ సినిమా కనెక్ట్ చేయడానికి ఎక్కడా రాజీ పడకుండా బోయపాటి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో చోటు చేసుకుంటున్న మత పరిస్థితులు .. సనాతన ధర్మంపై హిందువుల్లో రగులుతున్న పరిస్థితుల నేపథ్యంలోనే అఖండకు ఈ విషయాలు మరింత కలిసి వచ్చేలా కనిపిస్తున్నాయి. హిందుత్వం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలపై నెటిజన్లు ఇంటర్నెట్ లో శోధించడం ఈ మధ్య పెరిగిపోయింది. అందులో అఖండ 2 మొదటి స్థానంలో ఉంది. సరిగ్గా ఈ పాయింట్ నే ఇప్పుడు బోయపాటి క్యాష్ చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు సనాతనం, అఘోరాల విశిష్టతను మరింత గొప్పగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ సినిమాలో విదేశీ గడ్డ జార్జియా కూడా భాగం అవడం విశేషం అనే చెప్పాలి. ఇక అఖండ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసి మెప్పించారు. ఇప్పుడు కూడా ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నారా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇకపోతే ఈ సినిమాలో సంయుక్త మీనన్ (Samyuktha Menon) భాగమవుతుందని అధికారికంగా ప్రకటించారు. కానీ ప్రగ్యా జైశ్వాల్ పై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. మరి నటీనటుల సెలెక్షన్ ఇప్పటికే ఆల్మోస్ట్ జరిగిపోయింది. కానీ ఎవరు నటిస్తున్నారు అనే విషయాన్ని ఇంకా మేకర్స్ లీక్ చేయలేదు. మొత్తానికి అయితే అఖండ 2 ఇప్పుడు ఖండాలు దాటుతోంది. ఇక ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.