Intinti Ramayanam Today Episode April 25th: నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ అవని డబ్బులు తీసుకున్న విషయాన్ని అందరికి చెప్తాడు. అది విన్న రాజేంద్ర ప్రసాద్ నీ దగ్గర డబ్బులు తీసుకునింది తన సొంత ప్రయోజనాల కోసం కాదు నీ చెల్లెలు ప్రాణాలు కాపాడటానికి అని రాజేంద్రప్రసాద్ అంటాడు. చెల్లెలు ప్రాణాలు ఏంటి నాన్న ఏమైంది ప్రణతికి అని అందరూ అడుగుతారు. ప్రణతికి అబార్షన్ అయింది. తనకు సడన్గా యాక్సిడెంట్ అవడంతో చనిపోవాలని అనుకుంది. తాను చేసిన తప్పుని తెలుసుకొని అందరికీ దూరం అవ్వాలని ప్రణతి అనుకుంది. మళ్లీ అవని ప్రణతిని కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేసింది. అబార్షన్ అయిపోయిందని రాజేంద్రప్రసాద్ అంటాడు. అయితే అందరూ అవని గురించి తెలుసుకొని బాధపడతారు. అందరూ కలిసి ప్రణతిని చూద్దామని అంటారు.. రాజేంద్రప్రసాద్ నీకు ఫోన్ చేసి ప్రణతి ఆరోగ్యం ఎలా ఉందో నేను కనుక్కుంటానని అంటారు. మొత్తానికి ప్రణతిని ఇంటికి తీసుకురావాలని అందరు అనుకుంటారు. కానీ పల్లవి మాత్రం రేపు తీసుకురావచ్చు అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. భానుమతి తన ఆయుష్ ఎక్కడ తగ్గిపోతుందో త్వరగా ఎక్కడ చనిపోతుందని ఆలోచిస్తూ తన భర్త చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకొని పూజ గదిలోకి వెళ్లి అవనికి అన్యాయం జరిగింది. అవని మళ్లీ తిరిగి రావాలి నన్ను క్షమించు దేవుడా అని చేతిలో కర్పూరం పెట్టుకొని హారతిస్తుంది. అది చూసిన పల్లవి ఈ ముసలిదానికి ఏమైంది సడన్గా దెయ్యం పట్టిందా ఏంటి ఇలా మారిపోయింది లేదా పిచ్చి పట్టినట్లు ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది. పూజ గది నుంచి బయటికి వచ్చిన భానుమతిని పల్లవి అడుగుతుంది.
భానుమతి అసలు విషయం బయటకు చెబుతుంది. పల్లవి మాత్రం అసలు నమ్మదు. చచ్చిపోయిన వాడు వచ్చి నీకు చెప్పడం ఏంటి? ఈసారి నీ మొగుడు వచ్చినప్పుడు కట్టేసి నాకు చూపించు, అప్పుడు వచ్చిన వాడు. మనిషా, లేక దెయ్యమా అని నేను చూస్తాను అని పల్లవి అంటుంది. ఇక భానుమతి నా మొగుడు వచ్చినప్పుడు ఈ పల్లవికి ఒకసారి చూపిస్తే నమ్ముతుంది లేకపోతే నాకు పిచ్చి అనుకుంటుంది అనేసి అంటుంది. ఇక తర్వాత అందరూ ప్రణతిని తీసుకురావడానికి రెడీ అయ్యి బయటకు వస్తారు.
పల్లవి కోసం వెతుకుతారు పల్లవి పూజ గదిలోంచి హారతి తీసుకొని అందరిని హారతి తీసుకోమని అడుగుతుంది. అప్పుడే ఒక వ్యక్తి లోపలికి రావచ్చా అని అడుగుతారు. రాజేంద్రప్రసాద్ రమ్మని చెప్తాడు ఈ అబ్బాయి ఎవరో ఎవరికీ తెలియదు ఎవరు బాబు నువ్వు? ఏం కావాలి నీకు అని అడుగుతాడు.. అమ్మ ఈ ప్రణతిని ప్రేమించిన ప్రశాంత్ నేనే అని అనగానే అందరూ కోపంతో రగిలిపోయి అతన్ని చితక్కొట్టేస్తారు. నా కూతుర్ని ప్రేమించి మోసం చేస్తావని రాజేంద్రప్రసాద్ తో సహా ఇంట్లో ఉన్న మగవాళ్ళందరూ దారుణంగా తని కొడతారు.
కమల్ మాత్రం మా వదిన దగ్గరికి నేను తీసుకెళ్తాను నువ్వు ఎవరో తెలుసు అని అంటే మా వదిన్ని నేను తప్పని నమ్ముతాను. నువ్వు ఎవరో తెలియదని చెప్పిందంటే నిన్ను అక్కడే చంపేస్తానని కోపంగా అతన్ని స్వరాజ్యం ఇంటికి తీసుకెళ్తారు.. అవని ప్రణతి నువ్వు ఇప్పుడు సంతోషమైన లైఫ్ని గడపబోతున్నావు మంచి అబ్బాయిని చూసి నీకు పెళ్లి చేస్తారు మళ్లీ నువ్వు సంతోషంగా ఉంటావని అంటుంది. వీళ్ళందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే కార్లో అందరూ వస్తారు.
కమలు ఆ ప్రశాంత్ ని కాలర్ పట్టుకుని లాక్కొని వస్తాడు. వచ్చి రాగానే వదిన వీడియో కూడా నీకు తెలుసా అని అవనీని అడుగుతాడు కమల్. వీడెవడో నాకు తెలియదు కన్నయ్య ఏమైంది ఎవరు వీడు అని అడుగుతుంది. అప్పుడే ప్రణతి నన్ను ప్రేమించి మోసం చేశారని చెప్పాను కదా వదిన ప్రశాంతని చెప్పానుగా వీడే ఆ ప్రశాంత్ అని అంటుంది. ప్రణతిని వీడికి ఇచ్చి పెళ్లి చేయకుండా ఆపేసి నీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆస్తిని కొట్టేయాలని చూసావని వీడు చెప్తున్నాడు అది నిజమేనా అని అక్షయ్ అడుగుతాడు.. ఏం మాట్లాడుతున్నారండి మీరు వీడియో కూడా నాకు తెలియదు అంటే ఎందుకు నన్ను ఇలా అడుగుతున్నారు అని అవని షాక్ అవుతుంది. అవని నాకు తెలియదు అన్నమాట చెప్పడంతో కమల్ రెచ్చిపోయి వాడ్ని దారుణంగా కొడతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..