E-Paper
Advertisement

ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు.. ఫస్టియర్ విద్యార్థులదే హవా

ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు.. ఫస్టియర్ విద్యార్థులదే హవా
Advertisement

Amaravati: ఏపీలో ఇంటర్మీడియట్‌ ఫస్ట్, సెకండియర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ గురువారం ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ ఫస్టియర్‌లో 59 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌లో 53 శాతం మంది విద్యార్థులు విజయం సాధించారు. విజయం సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు మంత్రి.

ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ -2026 ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. విద్యార్థులు తమ ఫలితాలను ప్రభుత్వానికి చెందిన వెబ్‌సైట్‌తోపాటు వాట్సాప్ మన మిత్ర సేవ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపింది. ఇంటర్ తొలి ఇయర్ ఫలితాల్లో 2,29,034 మంది విద్యార్థులకు గాను 1,35,435 మంది తమ స్కోర్‌ను మెరుగుపరుచుకున్నారు. అంతే దాదాపు 59 శాతం అన్నమాట.

1,09,003 మంది అభ్యర్థులకు 42,379 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి ఫలితాలను మెరుగుపరుచుకున్నారు. దాదాపు 39 శాతం. ఇక సెకండియర్ ఫలితాల్లో 91,303 మంది విద్యార్థులకుగాను 48,149 మంది మెరుగైన ఫలితాలు సాధించారు. అంటే 53 శాతం సాధించారు. 1,02,018 మంది అభ్యర్థులకు గాను 57,327 మంది ఉత్తీర్ణత సాధించారు. 56 శాతం మంది విద్యార్థులు తమ ఫలితాలను మెరుగుపరుచుకున్నారు.

Advertisement

విజయం సాధించిన విద్యార్థులకు మంత్రి అభినందనలు

ఈ సందర్భంగా విజయవంతంగా ఉత్తీర్ణులైన విద్యార్థులు, తమ ప్రతిభను మెరుగుపరుచుకున్న వారికి అభినందనలు తెలిపారు మంత్రి నారా లోకేష్. మీ పట్టుదల నిజంగా ప్రశంసనీయం,విద్యా ప్రయాణంలో నిరంతర విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.

ప్రభుత్వం కల్పించిన అవకాశంతో మొత్తమ్మీద 1.83 లక్షల మందికి పైగా విద్యార్థులు మార్కులు పెంచుకున్నారు. సాధారణ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన దాదాపు లక్ష మంది విద్యార్థులకు మరో అవకాశం లభించింది. దీంతో వారంతా ఉన్నత విద్య వైపు అడుగులు వేయడానికి మార్గం సుగమమైంది.

ALSO READ: తెలంగాణలో శుక్రవారం ఇంజనీరింగ్ కౌన్సెలింగ్..15 వేల సీట్లు పెంపు, అందరి చూపు సీఈసీపైనే

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×