E-Paper
Advertisement

యాపిల్ నుంచి ఊహించని ట్విస్ట్.. iPhone 18లో ఏకంగా నాలుగు భారీ మార్పులు.. ధర ఎంతంటే?

యాపిల్ నుంచి ఊహించని ట్విస్ట్.. iPhone 18లో ఏకంగా నాలుగు భారీ మార్పులు.. ధర ఎంతంటే?
Advertisement

iPhone 18 Leaks: యాపిల్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ సిరీస్ సంచలనం సృష్టించగా.. ఇప్పుడు అందరి చూపు ఐఫోన్ 18 పై పడింది. వచ్చే ఏడాది ప్రారంభంలో రాబోతున్న ఈ ఫోన్ గురించి టెక్ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ప్రముఖ టిప్‌స్టర్స్ లీక్ చేసిన వివరాల ప్రకారం.. ఈ కొత్త ఫోన్‌లో అద్భుతమైన ఫీచర్లు ఉండబోతున్నాయి. యాపిల్ ప్రియులకు ఇది ఖచ్చితంగా ఒక మంచి వార్త అని చెప్పవచ్చు.

కొత్త డిజైన్, డిస్‌ప్లే:

ఈ కొత్త iPhone 18 మోడల్ 6.3 అంగుళాల డిస్‌ప్లేతో రాబోతోందని సమాచారం. అంతేకాకుండా మొదటిసారిగా సాధారణ మోడల్‌లో కూడా 120Hz రిఫ్రెష్ రేట్ ఇస్తున్నారట. దీనివల్ల ఫోన్ వాడకం చాలా స్మూత్‌గా, వేగంగా ఉంటుంది. స్క్రీన్ చూడటానికి, గేమింగ్ ఆడేవారికి ఇది సూపర్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ప్రసిద్ధ డైనమిక్ ఐలాండ్ డిజైన్ యథావిధిగా ఇందులో కూడా కొనసాగుతుంది.

Advertisement

Also Read: ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ల వర్షం.. ఆసుస్ పాపులర్ ల్యాప్‌టాప్‌పై ఏకంగా రూ.18,000 తగ్గింపు!

పవర్‌ఫుల్ ప్రాసెసర్:

ఫోన్ పనితీరు విషయంలో యాపిల్ ఎప్పుడూ రాజీపడదు. ఈసారి iPhone 18లో సరికొత్త ఏ20 చిప్‌సెట్‌ను ఉపయోగిస్తున్నారట. ఇది అత్యంత వేగంగా పనిచేస్తూ.. బ్యాటరీ లైఫ్‌ను కూడా ఆదా చేస్తుంది. అంతేకాకుండా ఫేస్ ఐడీ, మెరుగైన బ్యాటరీ కెపాసిటీ, వెనుక వైపు 48 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ రాబోతున్నాయని సమాచారం. దీనివల్ల ఫొటోలు, వీడియోలు మరింత క్వాలిటీగా వస్తాయి.

ర్యామ్ పెంపు:

Advertisement

ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు చాలా ముఖ్యం అయిపోయాయి. అందుకే కంపెనీ ఈ ఫోన్‌లో 9జీబీ ర్యామ్‌ను అందించబోతోందని టాక్. గత మోడళ్లతో పోలిస్తే.. ఇది చాలా పెద్ద అప్‌గ్రేడ్. ఈ అదనపు ర్యామ్ వల్ల యాపిల్ ఏఐ ఫీచర్లు, యాప్స్ చాలా స్పీడ్‌గా పనిచేస్తాయి. ఫోన్ హ్యాంగ్ అవ్వడం లేదా స్లో అవ్వడం వంటి సమస్యలు ఉండవు.

ధర పెరుగుతుందా?

టెక్నాలజీ మారుతున్న కొద్దీ విడిభాగాల ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మెమరీ చిప్‌ల ధరలు పెరగడం వల్ల ఈ కొత్త iPhone 18 ధర కూడా కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. భారతదేశంలో iPhone 17 ప్రారంభ ధర సుమారు రూ.82,900 ఉండగా.. ప్రస్తుతం అది రూ.99,900 వరకు విక్రయిస్తున్నారు. కాబట్టి కొత్తగా రాబోయే ఈ ఫోన్ ధర రూ.లక్ష మార్కు దాటే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read: పాత ఏసీ, ఫ్రిజ్‌ను అమ్మాలనుకుంటున్నారా? ఈ ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌తో ఇంటివద్దే పికప్, అకౌంట్లోకి నేరుగా డబ్బులు!

Tags

Related News

Jio vs Airtel.. కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్లలో దేనివి బెస్ట్? సూటిగా సుత్తిలేకుండా!

రూ.7,190కే వాషింగ్ మెషీన్..ఫీచర్లు తెలిస్తే వెంటనే కొనేస్తారు!

BSNL సంచలన ప్లాన్.. రోజుకు రూ.7 మాత్రమే.. ఏడాదంతా ఫ్రీ కాల్స్, డేటా!

ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ల వర్షం.. ఆసుస్ పాపులర్ ల్యాప్‌టాప్‌పై ఏకంగా రూ.18,000 తగ్గింపు!

హయర్, శాంసంగ్ ఫ్రిజ్‌లపై అమెజాన్ సేల్‌లో..భారీ డిస్కౌంట్లు!

జియో అదిరిపోయే ప్లాన్.. రూ.999 కే ఇన్ని బెనిఫిట్సా.. వర్త్ వర్మా వర్త్!

పాత ఏసీ, ఫ్రిజ్‌ను అమ్మాలనుకుంటున్నారా? ఈ ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌తో ఇంటివద్దే పికప్, అకౌంట్లోకి నేరుగా డబ్బులు!

Big Stories

Advertisement
×