E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

ఫాదర్స్ డే సందర్భంగా.. నాన్నకు ప్రేమతో స్పెషల్ విషెస్ చెప్పండిలా!

ఫాదర్స్ డే సందర్భంగా.. నాన్నకు ప్రేమతో స్పెషల్ విషెస్ చెప్పండిలా!
Advertisement

Fathers Day wishes 2026: అమ్మ లాలిపాట మన గుండెను తాకితే.. నాన్న నడిపించే బాట మన భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. సమాజం అనే మహాసముద్రంలో మన అడుగు తడబడకుండా, తన రెక్కల కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి, మనల్ని కంటికి రెప్పలా కాపాడుకునే ఏకైక నిస్వార్థ వీరుడు “నాన్న”. జూన్ మూడో ఆదివారం (ఫాదర్స్ డే) నాడు ఆ రియల్ సూపర్ హీరోకు సెల్యూట్ చేయడానికి, మీ గుండెల్లోని కృతజ్ఞతను చాటడానికి ఇక్కడ అద్భుతమైన, ఎమోషనల్ తెలుగు కవితలు ఉన్నాయి. ఈ డిజిటల్ యుగంలో మీ నాన్న మనసును గెలుచుకోవడానికి వీటిని వాట్సాప్ స్టేటస్‌గా లేదా పర్సనల్ మెసేజ్‌గా షేర్ చేసి సర్‌ప్రైజ్ చేయండి.

నాన్న త్యాగానికి అక్షర నీరాజనం:

ప్రపంచంలో అమ్మ ప్రేమకు దొరికిన గుర్తింపు నాన్న ప్రేమకు దక్కలేదు. ఎందుకంటే.. నాన్న ప్రేమ ఎప్పుడూ సినిమా వెనక వినిపించే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లాంటిది.. అది సైలెంట్‌గా ఉంటుంది కానీ సీన్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుంది. బయటకు గంభీరంగా కనిపిస్తూనే, లోపల పిల్లల భవిష్యత్తు కోసం క్షణాల్లోనే కరిగిపోయే వెన్నలాంటి మనసు నాన్నది. ఈ ఫాదర్స్ డే రోజున ఆయనకు ఏ బ్రాండెడ్ షర్టు, వాచీ కొనిచ్చినా రాని ఆనందం.. మీ మనసులోని ప్రేమని నాలుగు ముక్కల్లో మాటల చెబితే వస్తుంది. నాన్న కళ్ళల్లో ఆనంద బాష్పాలు తెప్పించే ఎమోషనల్ లైన్స్..

Advertisement

నాన్నపై హృదయాన్ని కదిలించే కవితలు:

1.లోకంలో ఎన్ని బంధాలు ఎదురైనా.. నాన్న వేలు పట్టుకుని వేసిన ఆ మొదటి అడుగు ముందు ఏదీ సాటిరాదు! హ్యాపీ ఫాదర్స్ డే నాన్న!

Advertisement

2. తన కన్నీళ్లను లోపలే దాచేస్తూ.. మన ముఖంలో చిరునవ్వుల పంటను పండించే నిస్వార్థ ప్రేమే నాన్న! హ్యాపీ ఫాదర్స్ డే నాన్న!

3. పగలు,రాత్రి తేడా లేకుండా శ్రమిస్తూ.. మన జీవితాల్లో వెలుగులు నింపే సూర్యుడు నాన్న! హ్యాపీ ఫాదర్స్ డే నాన్న!

4. నాన్న కోపంలో క్రమశిక్షణ ఉంటుంది.. ఆయన మౌనంలో మనపై ఉన్న అంతులేని బాధ్యత ఉంటుంది!  హ్యాపీ ఫాదర్స్ డే నాన్న!

5. నాన్న భుజాలపై కూర్చున్నప్పుడు కలిగిన ఆ అనుభూతి ముందు.. ఆకాశమంత సామ్రాజ్యమైనా చిన్నదే! హ్యాపీ ఫాదర్స్ డే నాన్న!

6. తన సొంత కోరికలను సమాధి చేస్తూ.. మన చిన్న చిన్న సరదాలకు ప్రాణం పోసే త్యాగమూర్తి నాన్న! హ్యాపీ ఫాదర్స్ డే నాన్న!

7.మాటల్లో ప్రేమను వ్యక్తపరచడం ఆయనకు తెలియదు.. కానీ చేతల్లో బాధ్యతను ఎన్నడూ విస్మరించడు. అతడే నాన్న! హ్యాపీ ఫాదర్స్ డే నాన్న!

8.నాన్న పాకెట్ మనీ ఇవ్వడంలోనే కాదు.. కష్టాల సుడిగుండం నుంచి మనల్ని కాపాడటంలోనూ ఎప్పుడూ ముందే ఉంటారు!హ్యాపీ ఫాదర్స్ డే నాన్న!

9. మనం ఎంతటి ఉన్నత శిఖరాలకు ఎదిగినా.. నాన్న కళ్ళకు మాత్రం ఎప్పటికీ చిన్న పిల్లల్లమే.. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న!

10.అడగకుండానే మన మనసులోని కోరికలను తీర్చే అద్భుతం నాన్న!హ్యాపీ ఫాదర్స్ డే నాన్న!

11. ఓర్పుకు మారు పేరు. నీతికి నిదర్శనం,భవిష్యత్ మార్గదర్శకులు, మన ప్రగతికి సోపానం నాన్న..హ్యాపీ ఫాదర్స్ డే నాన్న!

12.ముళ్ల బాటలో నువ్వు నడిచి.. పూల తోటలో మిమ్మల్ని నడిపించావు హ్యాపీ ఫాదర్స్ డే నాన్న!

13.ఓర్పుకు మారు పేరు ,మార్పుకు మార్గదర్శి, నీతికి నిదర్శనం, మన ప్రగతికి సోపానం నాన్నే.. హ్యపీ ఫాదర్స్ డే నాన్న!

14. ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా.. ఓడినప్పుడు నేనున్నానులే.. అని వెంట ఉండి ధైర్యం చెప్పే వ్యక్తి, గెలిచినప్పుడు ఆనందంగా పది మందికి చెప్పుకునే వ్యక్తి నాన్న ఒక్కరే.. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న!

15.మన భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తూ.. మనకు క్రమశిక్ష, సత్ప్రవర్తన, నైతిక విలువలు, నేర్పిస్తూ .. మనం ఉన్నత స్థాయికి చేరుకుంటే సంతోషించే తొలి వ్యక్తి నాన్న!హ్యాపీ ఫాదర్స్ డే నాన్న!

Related News

బీర్‌కు బ్రీజర్స్‌కు మధ్య తేడా ఏంటీ? ఏది ఆరోగ్యకరం? ఏది డేంజర్?

ఈ తేదీలో పుట్టినవారిది దానం చేసే గుణం.. ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటారు

మౌనంగా ఉండడం మీకు అలవాటుగా మారిందా? ఈ 5 నష్టాలకు అదే కారణం.. ఈ పరిస్థితుల్లో నోరు విప్పాల్సిందే

రోగనిరోధక శక్తిని పెంచే నేరేడు షర్బత్.. రుచికరంగా కాలా జామున్ డ్రింక్ ఇలా చేయండి

అతిగా వేళ్లు, మెడ ఇరుచుకొనే.. అలవాటు ఉన్నవాళ్లు ఎలాంటివాళ్లో తెలుసా? మీరు నమ్మలేరు

కరెంట్ షాక్ ప్రమాదం జరిగితే వెంటనే ఏం చేయాలి? ప్రాణాలు కాపాడేందుకు తీసుకోవాల్సిన 4 జాగ్రత్తలు

గుమ్మడికాయ ఆకులు తింటే రక్తహీనత సమస్యకు చెక్.. ఈ ఆకులతో అద్భుత ప్రయోజనాలు

Big Stories

×