E-Paper
Advertisement

AP TET 2025: ఏపీ టెట్ ఆన్సర్ కీ విడుదల.. తుది ఫలితాలు ఎప్పుడంటే?

AP TET 2025: ఏపీ టెట్ ఆన్సర్ కీ విడుదల.. తుది ఫలితాలు ఎప్పుడంటే?
Advertisement

AP TET 2025: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) ఆన్‌లైన్‌ రాత పరీక్షలు ముగిశాయి. డిసెంబర్ 10 నుంచి 21 మధ్య మొత్తం 10 రోజుల పాటు పరీక్షలు నిర్వహించారు. టెట్ పరీక్షలకు మొత్తం 2,71,698 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,48,427 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 91.43 శాతం మంది టెట్ పరీక్షలు రాశారు. మొత్తం అన్ని సెషన్లలో జరిగిన పరీక్షల ప్రైమరీ ఆన్సర్‌ కీలను విద్యాశాఖ త్వరలోనే వెబ్‌సైట్‌లో పెట్టనుంది. ఇప్పటికే పలు సబ్జెక్టుల ఆన్సర్ కీలను వెబ్‌సైట్‌లో ఉంచారు. ఆన్సర్‌ కీలతోపాటు అభ్యర్థుల రెస్సాన్స్ షీట్లను కూడా అందుబాటులో ఉంచింది.

జనవరి 2 నాటికి మొత్తం ఆన్సర్ కీలు

అభ్యర్థులు వెబ్ సైట్ లో లాగిన్ అయి ఆన్సర్‌ కీతోపాటు రెస్సాన్స్‌షీట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ మేరకు కన్వీనర్‌ వెంకట కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. డిసెంబర్‌ 15, 16, 17, 18 తేదీల్లో జరిగిన ప్రైమరీ టెట్ కీ డిసెంబరు 22న విడుదల చేశారు. డిసెంబర్ 19, 20, 21 తేదీల్లో జరిగిన పరీక్షల ఆన్సర్ కీలను 26న విడుదల చేయనున్నారు. ప్రాథమిక కీ పై అభ్యంతరాలను వెబ్‌సైట్‌ ద్వారా తెలియజేయవచ్చని కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. షెడ్యూల్‌ ప్రకారం వచ్చే ఏడాది జనవరి 2నాటికి ఆన్సర్‌ కీలను విడుదల చేస్తారు.

Advertisement

Also Read: AP Inter Exam Changes: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్ష విధానంలో కీలక మార్పులు

జనవరి 19న తుది ఫలితాలు

టెట్ ఫైనల్‌ కీని జనవరి 13న ప్రకటించినున్నారు. టెట్ ఫలితాలను జనవరి 19న విడుదల చేస్తారు. అలాగే ఇక వచ్చే ఏడాదిలో డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీచేస్తామని కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ ఏడాది నిర్వహించిన మెగా డీఎస్సీలో మిగిలిన పోస్టులతోపాటు కొత్తగా ఏర్పడే ఖాళీలతో 2 వేల పోస్టులు ఉంటాయని అంచనా. ఈ పోస్టులను కొత్త డీఎస్సీతో భర్తీ చేయనున్నారు. దీంతో టెట్‌ ఎక్కువ మార్కులు సాధించి తమ వెయిటేజీ మార్కులు పెంచుకునేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×