E-Paper
Advertisement

AP TET Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే

AP TET Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
Advertisement

AP TET Results: ఏపీ టెట్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు 2,71,692 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,48,427 మంది పరీక్షకు హాజరైనట్లు టెట్ కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. టెట్‌లో 97,560 మంది ఉత్తీర్ణులైనట్లు వెల్లడించారు. అభ్యర్థులు టెట్ ఫలితాలను https://tet2dsc.apcfss.in/ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. లేదా టెట్ ఫలితాలను 9552300009 వాట్సప్‌ నెంబర్‌తోనూ తెలుసుకోవచ్చు. టెట్‌లో 47.82 శాతం మంది అభ్యర్థుల ఉత్తీర్ణత సాధించారు.

ఏపీ టెట్ 2025 ఫలితాలను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. డిసెంబర్ సెషన్‌లో నిర్వహించిన టెట్ పరీక్షల ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ లు tet2dsc.apcfss.in, www.cse.ap.gov.in లలో చెక్ చేసుకోవచ్చు. ఉపాధ్యాయ అర్హత పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్, ప్రైవేట్ పాఠశాలల్లో 1 నుండి 8వ తరగతి వరకు బోధించేందుకు అభ్యర్థులు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. డిసెంబర్ 10 నుంచి టెట్ పరీక్షలు నిర్వహించారు. ఏపీ టెట్ పేపర్ 1, పేపర్ 2లకు వేర్వేరుగా ఫలితాలు ప్రకటించారు. టెట్ పరీక్ష ఒకసారి అర్హత సాధిస్తే.. జీవితకాలం చెల్లుతుంది. ఏపీ టెట్ అర్హత సాధించిన అభ్యర్థులు డీఎస్సీ రాసేందుకు అర్హులవుతారు. టెట్‌లో సాధించిన స్కోరుకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ అంటుంది.

Advertisement

Also Read: తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే 

ఇన్ సర్వీస్ టీచర్ల రెండేళ్లలోపు టెట్ అర్హత సాధించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే సుప్రీం తీర్పుతో ఈసారి ఏపీలో 31,886 మంది పరీక్షలు రాశారు. అందులో 47.82 శాతం మంది పాసైనట్లు అధికారులు తెలిపారు. టెట్ ఫెయిలైన టీచర్లు మరోసారి టెట్ రాసే అవకాశం ఉంది.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×