AP Electricity Charges: ఏపీ ప్రజలకు ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. అసలే రానున్నది ఎండాకాలం. అలాంటి సమయంలో ఇలాంటి శుభవార్త చెప్పడం శుభపరిణామమే. సరుకుల ధరలు పెరిగి ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్న ప్రజలకు.. మరో భారం పడనుందనే వార్తల నేపథ్యంలో.. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడిందని చెప్పవచ్చు. ఇప్పటికే పలుమార్లు సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ఆ ధరల పెంపు లేనేలేదని పలుమార్లు తేల్చి చెప్పారు. కానీ వైసీపీ మాత్రం ప్రజలకు ఆర్థిక భారాన్ని మోపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, రాష్ట్రవ్యాప్తంగా నిరసన కూడా తెలిపింది. వైసీపీ విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చేలా గురువారం ప్రకటన విడుదలైంది. ఇక ఆ భారం పడుతుందేమోనన్న ఆందోళన ప్రజలకు ఇక లేదని చెప్పవచ్చు.
సామాన్య ప్రజలకు గల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం ఇప్పటికే ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తోంది. ఈ పథకాన్ని దీపావళి రోజు దీపం పథకం 2.ఓ పేరుతో ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ దశలో ఏపీలో విద్యుత్ ధరలు పెరగనున్నాయని, జోరుగా ప్రచారం సాగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ధరలను పెంపును నిరసిస్తూ పెద్ద ధర్నానే నిర్వహించారు. ఆ సమయంలో కూటమి వర్సెస్ వైసీపీ మధ్య విమర్శల జోరు సాగింది. ఏపీ కాంగ్రెస్ అద్యక్షురాలు వైఎస్ షర్మిళ కూడా విద్యుత్ ధరలు పెంచితే ఒప్పుకొనే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
అయితే సీఎం చంద్రబాబు నాయుడు పలు బహిరంగ సభలలో విద్యుత్ ధరల పెంపు లేనే లేదంటూ తేల్చి చెప్పారు. కానీ గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్ల విషయంలో అవినీతి జరిగిందంటూ విమర్శించారు. విద్యుత్ ధరలు పెరిగితే సామాన్య ప్రజానీకం పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ప్రధానంగా కూలి నాలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే కుటుంబాలకు ఆర్థిక భారం అవుతుంది.
ఇలా విద్యుత్ ధరలపై పలు వదంతులు వ్యాపిస్తున్న తరుణంలో ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ఏపీలో విద్యుత్ చార్జీల పెంపు లేనే లేదని ఈఆర్సీ చైర్మన్ ఠాకూర్ గురువారం ప్రకటించారు. సాధారణంగా మార్చి 31 లోగా విద్యుత్ టారిఫ్ లను విడుదల చేస్తారు. కానీ రాష్ట్రంలో విద్యుత్ చార్జీల టారిఫ్ లను గురువారం విడుదల చేసి, విద్యుత్ ఛార్జీలు ఏ విభాగంలో కూడా పెంచలేదని ఠాకూర్ తేల్చి చెప్పారు.
Also Read: AP Schools: ఏపీలో ఒంటి పూట బడులు? ఆ తేదీ నుండేనా?
ఈ ప్రకటనతో ఏపీ ప్రజలకు విద్యుత్ చార్జీల భారం లేదని చెప్పవచ్చు. అసలే పెరిగిన ఖర్చులతో సామాన్య కుటుంబాలు జీవనం సాగిస్తున్న తరుణంలో.. విద్యుత్ ఛార్జీలను పెంచిన యెడల వారికి గుదిబండగా మారుతుందని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితిని అర్థం చేసుకున్న కూటమి ప్రభుత్వం.. తాజాగా విడుదల చేసిన ప్రకటనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఏపీ ప్రజలకు.. విద్యుత్ చార్జీల భారం లేదని విద్యుత్ టారిఫ్ ల విడుదలతో ఓ క్లారిటీ వచ్చేసింది.