BigTV English

Assistant Manager Jobs: బీఈ, బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ.62,000 జీతం.. పూర్తి వివరాలివే..

Assistant Manager Jobs: బీఈ, బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ.62,000 జీతం.. పూర్తి వివరాలివే..

Assistant Manager Jobs: సివిల్ విభాగంలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్(సీఎంఆర్ఎల్)‌లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.


నిరుద్యోగులకు ఇది సూపర్ న్యూస్ అనే చెప్పవచ్చు. చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్(సీఎంఆర్ఎల్)లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్(సివిల్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 10 లోపు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసారి నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూసేద్దాం.

మొత్తం ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య: 8


ఇందులో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు(సివిల్) ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్(సివిల్) పాసై ఉండాలి. వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటారు.

జీతం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ.62,000 జీతం ఉంటుంది.

వయస్సు: 2025 జనవరి 8 నాటికి 30 ఏళ్ల వయస్సు మించరాదు.

దరఖాస్తు విధానం: ఈ ఉద్యోగానికి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: యూఆర్, జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. (ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, దివ్యాంగ అభ్యర్థులు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది)

ఉద్యోగ ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 10

అఫీషియల్ వెబ్ సైట్: https://chennaimetrorail.org/job-notifications/

Also Read: Jobs In INCOIS: రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలు.. ఈ అర్హతే అప్లై చేయండి.. నెలకు రూ.67,000 జీతం

అర్హత కలిగిన అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుకు ప్రారంభ జీతమే రూ.62,000 వరకు ఉంటుంది. పిబ్రవరి 10లోగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి.  ఆల్ ది బెస్ట్.

Related News

AAI Notification: ఏఏఐలో భారీగా ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,40,000.. ఇంకెందుకు ఆలస్యం

Indian Navy: ఇండియన్ నేవీలో 1266 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ. 63,200

SBI Notification: ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసై ఉంటే అప్లై చేసుకోవచ్చు..

Indian Railway: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ జాబ్స్.. మంచివేతనం.. లాస్ట్ డేట్ ఇదిగో..?

IOB notification: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగాలు.. నెలకు స్టైఫండ్ ఇచ్చి మరీ ఉద్యోగం..?

Telangana RTC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు

Big Stories

×