E-Paper
Advertisement

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పై.. కీలక వ్యాఖ్యలు చేసిన మహేష్ కుమార్ గౌడ్!

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పై.. కీలక వ్యాఖ్యలు చేసిన మహేష్ కుమార్ గౌడ్!
Advertisement

Indira Gandhi: భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళ, దేశ సమగ్రత , సమైక్యత కోసం ప్రాణ త్యాగం చేసిన మహానేత శ ఇందిరాగాంధీ అని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఆయన నివాళులర్పించారు.ఈ విషయమై ఆయన ఒక ప్రకటన చేస్తూ దేశంలో పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. బ్యాంకుల జాతీయీకరణ, భూ సంస్కరణలు, పేదలకు సంక్షేమ పథకాలు అందించడం వంటి చారిత్రాత్మక నిర్ణయాలతో ఇందిరాగాంధీ దేశ చరిత్రలో చెరగని ముద్ర వేశారని కొనియాడారు.

కుటుంబ బీమా పథకం..

ఇందిరమ్మ ఆశయాలే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు మార్గదర్శకమనిఇందిరా గాంధీ పేరుతో తెలంగాణలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు.ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రభుత్వం తీసుకురావడంఅభినందనీయమని అన్నారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తిని కోల్పోయినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా కుంగిపోకుండా అండగా నిలవాలన్నదే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని అన్నారు. అలాగే ఇందిరమ్మ చీరలు తెలంగాణ ఆడపడుచులకు ఆత్మ గౌరవం, ఆత్మీయతకు ప్రతీకగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం మహిళల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న గౌరవానికి నిదర్శనమని అన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.

అదే స్ఫూర్తితో..

Advertisement

సామాజిక పెన్షన్లు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన నిరుపేదలకు సామాజిక భద్రత కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందిస్తూ వారి జీవనానికి భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని గతంలో ఇందిరాగాంధీ పేదల పక్షాన నిలబడి దేశంలో సంక్షేమ పాలనకు బలమైన పునాదులు వేస్తే, నేడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అదే స్ఫూర్తితో ప్రజా పాలనను కొనసాగిస్తోందని అన్నారు.

ఎన్నికల హామీ కాదు..

కాంగ్రెస్ పార్టీకి సంక్షేమం అనేది కేవలం ఎన్నికల హామీ కాదు.. అది ప్రజల పట్ల ఉన్న బాధ్యత. పేదల ముఖాల్లో చిరునవ్వులు చూడటం, మహిళలకు భద్రత కల్పించడం, వృద్ధులకు గౌరవప్రదమైన జీవనం అందించడం, ప్రతి నిరుపేద కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ఇందిరాగాంధీకి మనం అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. ఇందిరాగాంధీ ఆశయాలను కొనసాగిస్తూ తెలంగాణను సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయంలో దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

Advertisement

Also Read: క్రీడల విషయంలో.. సీఎం రేవంత్‌కు హరీష్ రావు చాలెంజ్?

Tags

Related News

ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ కావాలనుకునే వారికి షాకింగ్ న్యూస్?

క్రీడల విషయంలో.. సీఎం రేవంత్‌కు హరీష్ రావు చాలెంజ్?

ఇకపై సభలు, ఫంక్షన్ల నిర్వహణపై.. మున్సిపల్ కార్పొరేషన్ కొత్త రూల్స్?

కేటీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్.. బీఆర్ఎస్‌కు సవాల్!

తెలంగాణకు అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాలకు భారీ వర్షాలు!

‘షీ టీమ్స్’ పేరుతో నకిలీ నోటీసు.. మాజీ ప్రియుడిపై యువతి రివేంజ్.. పోలీసులు సైతం షాక్!

ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పార్లమెంటరీ కమిటీతో సీఎం రేవంత్ భేటీ.. ఆ అంశాలపై చర్చ!

Big Stories

Advertisement
×