E-Paper
Advertisement

Group-1 Exam Schedule: గ్రూప్-1 అభ్యర్థులకు బిగ్ అలెర్ట్.. ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్

Group-1 Exam Schedule: గ్రూప్-1 అభ్యర్థులకు బిగ్ అలెర్ట్.. ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్
Advertisement

Group-1 Exam Schedule: ఏపీ రాష్ట్ర గ్రూప్-1 అభ్యర్థులకు ఇది అలెర్ట్. రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటనను జారీ చేసింది. గ్రూప్-1 మెయిన్స్ రాత పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ వివరాలను ఏపీపీఎస్సీ వెల్లడించింది.

మే 3 నుంచి 9 వరకు గ్రూప్ మెయిన్స్ రాత పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల కోసం రాష్ట్రంలోని 4 జిల్లా కేంద్రాల్లో ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాట్లు చేస్తున్నట్టు ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు. మెయిన్స్ రాత పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. మెయిన్ హాల్ టికెట్లను అఫీషియల్ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

Advertisement

అఫీషియల్ వెబ్ సైట్: psc.ap.gov.in

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ కు సంబంధించి మొత్తం ఏడు పేపర్లు ఉంటాయి. డిస్క్రిప్టివ్ టైప్ లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అంటే వ్యాస రూపంలో 200 నుంచి 300 పదాలల్లో సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎగ్జామ్ షెడ్యూల్ డేట్లు ఏపీపీఎస్సీ అధికారులు వెబ్ సైట్ లో పొందుపరిచారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఈ సారి కూడా ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ క్వశ్చన్ పేపర్ ను ట్యాబ్ లలో పొందుపరిచి ఇవ్వాలని నిర్ణయించినట్టు ఏపీపీఎస్సీ కార్యద్శి నరసింహమూర్తి తెలిపారు. అలాగే ఈసారి గ్రూప్- 1 అభ్యర్ధులు రాసే ఆన్సర్ బుక్‌ లెట్‌ లను కూడా రూల్‌ పేపర్స్‌కి బదులు వైట్‌ పేపర్ల బుక్‌ లెట్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.

Advertisement

2023 డిసెంబర్‌ నెలలో మొత్తం 89 గ్రూప్‌ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.  గతేడాది మార్చి 17వ తేదీన ఏపీపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించింది. అదే ఏడాది ఏప్రిల్‌ నెలలో అధికారులు ఫలితాలను కూడా విడుదల చేశారు. అనంతరం ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 1:50 ప్రాతిపదికన 4,496 మందిని మెయిన్స్‌కి ఎంపిక చేశారు. వీరందరికీ మే నెలలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం పరీక్ష కేంద్రాల్లో మెయిన్‌ పరీక్షలు జరగనున్నాయి.

గ్రూప్-1 మెయిన్స్ సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్. ఈ స్వల వ్యవధిలో చదివిన పుస్తకాలను చదవండి. నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. ఎగ్జామ్స్ బాగా రాయండి. ఆల్ ది బెస్ట్.

Also Read: CSIR-NEERI Recruitment: ఇంటర్ పాసైన వారికి బంపర్ ఆఫర్.. ఈ జాబ్ కొడితే నెలకు రూ.80,000 జీతం భయ్యా..

Also Read: Civil Services Results: సివిల్స్-2024 ఫలితాలు వచ్చేశాయ్.. మెరిసిన తెలుగు ఆణిముత్యాలు..

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×