CSIR-NEERI Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. ఇంటర్మీడియర్ పాసైన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం అనే చెప్పవచ్చు. సీఎస్ఐఆర్ కు చెందిన నేషనల్ ఎన్విరాన్ మెంట్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి మంచి జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. అర్హత ఉన్న వారు అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ పూర్తి సమాచారం గురించి ఇప్పుడు చూద్దాం.
సీఎస్‌ఐఆర్‌కు చెందిన నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, నాగ్‌పుర్, మహారాష్ట్ర లో పలు రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత ఉండి ఆసక్తి ఉన్న వారు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 30న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
వెకెన్సీల సంఖ్య: 33
సీఎస్‌ఐఆర్‌కు చెందిన నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ లో వివిధ రకాలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో జూనియర్ సెక్రటేరియన్ అసిస్టెంట్ (జనరల్), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఫైనాన్స్), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (స్టోర్స్) ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు:
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్)- 14
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఫైనాన్స్)- 05
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (స్టోర్స్)- 07
జూనియర్ స్టెనోగ్రాఫర్- 07
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 30
విద్యార్హత: టెన్+2, ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
జీతం: ఉద్యోగాన్ని బట్టి వేతనం ఉంటుంది. నెలకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కు రూ.19,900- రూ.63,200, జూనియర్ స్టెనోగ్రాఫర్‌కు రూ.25,500- రూ.81,100 వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ జాబ్స్ కు దరఖాస్తు చేసుకోండి.
వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. దరఖాస్తు గడువు నాటికి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కు 28 ఏళ్లు, జూనియర్ స్టెనోగ్రాఫర్‌కు 27 ఏళ్లు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉండగా.. ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉండును. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: రాతపరీక్ష, ప్రొఫిషయన్సీ టెస్ట్, కంప్యూటర్ స్పీడ్ టెస్ట్ తదితర అధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.neeri.res.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటనే అప్లై చేయండి. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది. నెలకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కు రూ.19,900- రూ.63,200, జూనియర్ స్టెనోగ్రాఫర్‌కు రూ.25,500- రూ.81,100 వేతనం ఉంటుంది.
Also Read: UCSL Recruitment: ఐటీఐ, డీగ్రీ అర్హతలతో ఉద్యోగాలు.. ప్రారంభ వేతనం రూ. 40,650.. ఇంకెందుకు ఆలస్యం
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 33
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 30