Civil Services Results: సివిల్స్ అభ్యర్థులకు ఇది బిగ్ అలెర్ట్. సివిల్స్- 2024 ఫలితాలు రిలీజ్ అయ్యాయి. కాసేపటి క్రితమే ఫైనల్ ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. ఫలితాల్లో శక్తి దూబేకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల నుంచి సాయి శివానికి 11వ ర్యాంక్, బన్నా వెంకటేష్ కు 15వ ర్యాంక్ వచ్చింది. శ్రవణ్ కుమార్ రెడ్డికి 62 వ ర్యాంక్, సాయి చైతన్య జాదవ్ కు 68 వ ర్యాంక్ సాధించారు.
సివిల్స్ సాధించిన అభ్యర్థులకు మంత్రి పొన్నం శుభాకాంక్షలు..
సివిల్స్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మంచి ఫలితాలు సాధించిన తెలంగాణ అభ్యర్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. సివిల్స్ ఫలితాల్లో విజయం సాధించి లక్ష్యాన్ని చేరుకున్న వారు భవిష్యత్తులో అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజల పక్షాన పని చేయాలని మంత్రి సూచించారు. సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయి మెయిన్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకుసీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం రాజీవ్ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రారంభించి వారికి ప్రోత్సాహకాన్ని అందించిందని గుర్తుచేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వారిని ప్రోత్సహించి వారికి ప్రభుత్వం అండగా నిలబడడం వల్లే తెలంగాణ కి సివిల్స్ మంచి ఫలితాలు సాధించాయని పేర్కొన్నారు. భవిష్యత్ లో తెలంగాణ రాష్ట్రం నుండి అత్యధిక సంఖ్యలో సివిల్స్ ర్యాంకులు సాధించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు.
Also Read: CSIR-NEERI Recruitment: ఇంటర్ పాసైన వారికి బంపర్ ఆఫర్.. ఈ జాబ్ కొడితే నెలకు రూ.80,000 జీతం భయ్యా..