Priyadarshi: ముందుగా కమెడియన్స్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆ తర్వాత హీరోలుగా మారిన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ అందులో సక్సెస్ అయినవారి సంఖ్య మాత్రం చాలా తక్కువ. కమెడియన్స్‌గా కొందరిని ఫిక్స్ అయిన తర్వాత వారు హీరోలుగా మారితే ప్రేక్షకులు చాలావరకు దానిని యాక్సెప్ట్ చేయలేరు. అలా ఎంతోమంది కమెడియన్స్‌గా కెరీర్‌లో పీక్స్ చూసి.. ఆ తర్వాత హీరోలుగా మారి.. అందులో సక్సెస్ అవ్వలేక.. ఇప్పుడు మళ్లీ కమెడియన్స్‌గా ఫిక్స్ అయిపోతున్నారు. అయినా కూడా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాడు ప్రియదర్శి (Priyadarshi). తను హీరోగా నటించిన ‘సారంగపాణి జాతకం’ విడుదలకు సిద్ధమవుతుండగా ఈ మూవీ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
అదంతా చెత్త
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా నటించిన చిత్రమే ‘సారంగపాణి జాతకం’. ఇందులో జాతకాల పిచ్చి ఉన్న పాత్రలో ప్రియదర్శి కనిపించనున్నాడు. త్వరలోనే విడుదల కానున్న ఈ మూవీకి ప్రమోషన్స్ మొదలుపెట్టాడు. తను జాతకాలను నమ్మినా కూడా అంత ఎక్కువగా నమ్మనని స్టేట్‌మెంట్ ఇచ్చాడు ప్రియదర్శి. తుమ్మిస్తే అపశకునం అని, నల్లపిల్ల ఎదురైతే మంచిది కాదని.. ఇలాంటివి తాను నమ్మను అని చెప్పేశాడు. ఒకవేళ నెగిటివ్ విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తే.. అలాంటివే జరిగే అవకాశాలు పెరుగుతాయని ఒక సూత్రాన్ని చెప్పాడు. ఎవరైనా వచ్చి ఇలా చేస్తేనే తనకు అదృష్టం కలిసొస్తుంది అని చెప్తే దానిని చెత్తలాగా పరిగణినిస్తానని అన్నాడు ప్రియదర్శి.
రెమ్యునరేషన్ పెంచుతాను
కమెడియన్ నుండి హీరోగా మారిన తర్వాత అసలు ప్రియదర్శిని అందుకోలకపోతున్నామని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుందని, రెమ్యునరేషన్ పెంచేశారని కూడా వార్తలు వినిపిస్తున్నాయని అనగా దానిపై తను స్పందించాడు. ‘‘ఏదో ఒకేసారి హైప్ రావడం వల్ల ఇలా మాట్లాడుతున్నారు. కానీ నేను ఇప్పటికీ నా పాత ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్నాను. రెమ్యునరేషన్ విషయానికొస్తే నేను కచ్చితంగా పెంచుతాను. ఖాళీగా కూర్చున్న రోజుల్లో ఎవ్వరినీ రెమ్యునరేషన్ అడగలేదు కదా. నేను ఇప్పుడు చేస్తున్న దానికోసం డబ్బులు అడగడం లేదు. అప్పుడు ఖాళీగా ఉన్నందుకు ఇప్పుడు డబ్బులు తీసుకుంటున్నాను’’ అంటూ కొత్త లాజిక్ చెప్పాడు ప్రియదర్శి.
Also Read: మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే.?
పుష్ప 2 వల్లే
‘సారంగపాణి జాతకం’ (Sarangapani Jathakam) ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీని పోస్ట్‌పోన్ చేసుకుంది. దీంట్లో కూడా ఏమైనా సెంటిమెంట్ ఉందా అనే ప్రశ్న ప్రియదర్శికి ఎదురయ్యింది. ‘‘మొదటిసారి ఈ మూవీ పోస్ట్‌పోన్ అవ్వడానికి పుష్ప 2నే కారణం. అప్పటికే ఆ మూవీపై చాలా హైప్ క్రియేట్ అయ్యింది. ఆ సమయంలో మా సినిమా విడుదల చేస్తే థియేటర్లకు ప్రేక్షకులు రారు అనుకున్నాం. జనవరిలో విడుదల చేయడం కూడా కష్టమే. అందుకే ఇలాంటి కామెడీ సినిమా విడుదల చేయడానికి సమ్మర్ పర్ఫెక్ట్ అనుకున్నాం. ఇండస్ట్రీలో చాలామంది పెద్దవారు కలిసి కూర్చొని తీసుకున్న నిర్ణయం ఇది’’ అని క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి ఈ మూవీ ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది.