E-Paper
Advertisement

California Massive Waves: రాకాసి అలలతో కాలిఫోర్నియా బెంబేలు

California Massive Waves: రాకాసి అలలతో కాలిఫోర్నియా బెంబేలు
Advertisement

California Massive Waves: గత మూడు రోజులుగా రాకాసి అలలు కాలిఫోర్నియా తీరవాసులను భయపెడుతున్నాయి. 40 అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడుతున్న అలలతో తీరం మొత్తం బెంబేలెత్తుతోంది. ఇప్పటికే తీర సమీపంలోని నివాసాలపై విరుచుకు పడుతున్నాయి. తీర ప్రాంతంలో ఎవరూ సంచరించొద్దని, బీచ్‌లు అన్నింటినీ మూసివేశామని అధికారులు ప్రకటించారు.

కాలిఫోర్నియా, ఒరెగాన్ తీర ప్రాంతాల్లోని దాదాపు 60 లక్షల మంది ఈ అలల ప్రభావాన్ని చవిచూస్తున్నారు. వెంచురా కౌంటీ తీర ప్రాంతంలో అయితే.. అక్కడ ఏర్పాటు చేసిన రక్షణ గోడను సైతం దాటి అలలు ఎగసిపడ్డాయి. దీంతో పలు వాహనాలు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లను సముద్రపు నీరు ముంచెత్తింది. రాకాసి అలలు ఏర్పడానికి అసలు కారణం ఏమిటి? గాలి వేగం, అది సముద్ర జలాలపై ప్రభావం చూపే దూరం, సమయం వంటి అంశాలపై ఇది ఆధారడి ఉంటుంది.

Advertisement

సముద్రంపై గాలి వేగం అత్యధికంగా ఉన్న సమయంలో రాకాసి అలలు ఏర్పడతాయి. గాలి వేగంతో ఉద్భవించే శక్తి ఉపరితల జలాలపై ఒత్తిడి కలగజేయడంతో అలలు ఏర్పడతాయి. గాలి వేగం పెరిగే కొద్దీ అలల ఉధృతి పెరుగుతుంటుంది. తుఫాన్ల సమయంలో గాలి వేగానికి అల్లకల్లోల పరిస్థితులు తోడు కావడంతో ఈ తరహా రాకాసి అలలను కాలిఫోర్నియా తీరంలో చూడొచ్చు.

గాలి వేగం సముద్ర ఉపరితల జలాలపై ఎంత ఎక్కువ సేపు ఉంటే.. అంత భారీ స్థాయిలో అలలు ఏర్పడతాయి. చిన్న అలలు ఒకదానినొకటి ఢీకొని అక్కడికక్కడే విరిగిపడొచ్చు. లేదంటే అవి పరస్పరం తోడై ఆకస్మికంగా భారీ అల రూపాన్ని సంతరించుకునే అవకాశాలు కూడా ఉంటాయి. పసిఫిక్ సముద్ర తుఫాన్లలో గాలి వేగం ఎక్కువ సేపు ఉన్నప్పుడు ఇలాంటి రాకాసి అలలు ఏర్పడతాయి.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×