EDCIL Jobs: సైకాలజీ ఎంఎస్సీ, ఎంఏ, బ్యాచిలర్స్ డిగ్రీ, కెరీర్ గైడెన్స్, కౌన్సిలింగ్ లో డిప్లొమా ఉన్న వారికి గుడ్ న్యూస్. ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(EDCIL)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. న్యూఢిల్లీలోని ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(ఈడీసీఐఎల్) ఒప్పంద ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాల్లో కెరీర్–మెంటల్ హెల్త్ కౌన్సిలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 255
విద్యార్హత: అభ్యర్థులు తప్పనిసరిగా సైకాలజీలో ఎమ్మెస్సీ, ఎంఏ, బ్యాచిలర్స్ డిగ్రీ, కెరీర్ గైడెన్స్, కౌన్సిలింగ్‌లో డిప్లొమా కలిగి ఉండాలి. సంబంధిత రంగాల్లో కనీసం 2 1/2 సంవత్సరాల కౌన్సిలింగ్ అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు: 2024 డిసెంబర్ 31 నాటికి 40 ఏళ్లు మించి ఉండరాదు.
జీతం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30,000 జీతం ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: విద్యార్హత, వర్క్ ఎక్స్ పీరియన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు విధానం: అప్లికేషన్ లింక్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Scientist Jobs in CRRI: ఈ అర్హత ఉన్న వాళ్లకు గోల్డెన్ ఛాన్స్.. నెలకు రూ.1,35,000.. DON‘T MISS..
దరఖాస్తకు చివరి తేది: 2025 జనవరి 10
అఫీషియల్ వెబ్ సైట్: https://www.edcilindia.co.in