South Africa Squad: ఫిబ్రవరి 19.. అంటే సరిగ్గా మరో 36 రోజులలో ఛాంపియన్స్ ట్రోఫీ – 2025 ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఐదు జట్లు తమ స్క్వాడ్ లను ప్రకటించాయి. ఈ క్రమంలో తాజాగా దక్షిణాఫ్రికా జట్టు కూడా తమ టీమ్ ని ప్రకటించింది. పాకిస్తాన్ లో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం సౌత్ ఆఫ్రికా 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది.
Also Read: ICC – IPL 2025: ICC కొత్త రూల్స్.. ఇక ఐపీఎల్ ప్లేయర్లకు దూలతీరాల్సిందే ?
సౌత్ ఆఫ్రికా జట్టు: తెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మర్క్రామ్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్ట్జే, కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, తబ్రైజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, ట్రిస్టన్ స్టబ్స్‌డెన్. ఇలా 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది సౌత్ ఆఫ్రికా. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ 2015 కి జట్టు కెప్టెన్ గా తెంబా బవుమాని నియమించింది.
ఇతడు దక్షిణాఫ్రికా కెప్టెన్ గా పగ్గాలు చేపట్టినప్పటి నుండి.. ఆ జట్టు మంచి విజయాలు సాధిస్తుంది. 2021 నుండి బవుమా మూడు ఫార్మాట్లలో కలిపి 67 మ్యాచ్ లకు నాయకత్వం వహించాడు. ఇందులో దక్షిణాఫ్రికా 41 మ్యాచ్ లు గెలిచింది. 23 మ్యాచ్ లు ఓడిపోయి.. ఒక మ్యాచ్ డ్రా గా మిగిలింది. కెప్టెన్ గా బవుమా 61.19 విన్నింగ్ పర్సంట్ ని కలిగి ఉన్నాడు. బవుమా 2023లో టెస్ట్ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించాడు. తన కెప్టెన్సీలో ఇప్పటివరకు 9 టెస్టుల్లో దక్షిణాఫ్రికా ఒక్క మ్యాచ్ లోను ఓడిపోలేదు.
అంతేకాదు అతడు టెస్టుల్లో 57.78 సగటుతో 809 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇతని సారథ్యంలో సౌత్ ఆఫ్రికా వరుసగా ఏడు టెస్ట్ మ్యాచ్ లలో గెలిచింది. 2021లో వన్డే కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన బవుమా.. 38 వన్డేలకి కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇందులో 21 వన్డేలు గెలుపొందగా.. మరో 16 మ్యాచ్ లని సౌత్ ఆఫ్రికా ఓడిపోయింది. బవుమా వన్డేల్లో 5 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలతో 1631 పరుగులు చేశాడు.
ఈ క్రమంలో అతని సారధ్యంలోనే ఛాంపియన్ ట్రోఫీ 2025 కి వెళ్లాలని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు నిర్ణయించింది. అయితే ఇక్కడ మరో సమస్య ఏంటంటే పాకిస్తాన్ లోని కరాచీ నేషనల్ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 21వ తేదీన ఆఫ్ఘనిస్తాన్ తో గ్రూప్ బి మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బవుమా నేతృత్వంలోని జట్టు ఆఫ్ఘనిస్తాన్ తో తలపడనుంది. కానీ ఈ మ్యాచ్ ని నిషేదించాలనే డిమాండ్స్ వస్తున్న నేపథ్యంలో ఐసీసీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి.
Also Read: Yog Raj on Yuvraj Singh: గ్రౌండ్ లోనే యువీ చనిపోయినా గర్వపడేవాడిని !
అయితే ఇప్పటివరకు పాకిస్తాన్ మరియు భారత జట్లు మాత్రం తమ టీమ్ లని వెల్లడించలేదు. టీమ్ ఇండియా జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ ఫిట్నెస్ వల్లే జట్టును ఆలస్యంగా ప్రకటించనుందని సమాచారం. ఒకసారి జట్టును ప్రకటించిన తర్వాత మార్పులు చేసుకోవడానికి అవకాశం లేకపోవడంతో జట్టు కూర్పు పై బీసీసీఐ ఆచితూచి వ్యవహరిస్తోంది.
SOUTH AFRICA SQUAD FOR CHAMPIONS TROPHY 2025 🏆
Bavuma (C), Stubbs, Shamsi, Tony de Zorzi, Dussen, Ngidi, Rickelton, Miller, Markram, Mulder, Klaasen, Maharaj, Jansen, Rabada, Nortje pic.twitter.com/wMCg5dr9pW
— Johns. (@CricCrazyJohns) January 13, 2025