Cement Corporation of India jobs: నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్ట్రీ పరిధిలో గల మినీరత్న కంపెనీ అయినటువంటి బ్రాడ్ కాస్టింగ్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాల ఒప్పంద విధానంలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, రాజ్బన్ సిమెంట్ ఫ్యాక్టరీ(హిమాచల్ ప్రదేశ్) సంస్థ కార్యాలయంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 5
ఇందులో వివిధ రకాల ఉద్యోగాలున్నాయి. బర్నర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్ స్ట్రుమెంట్ మెకానిక్ ఉద్యోగాలుఖాళీగా ఉన్నాయి.
ఇందులో బర్నర్ 1, ఫిట్టర్ 2, ఎలక్ట్రీషియన్ 1, ఇన్ స్ట్రుమెంట్ మెకానికి్ -01 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
విద్యార్హత: బర్నర్ ఉద్యోగానికి కెమిస్ట్రీ సబ్జెక్ట్ గా కలిగిన బీఎస్సీ డిగ్రీ పాస్ తో పాటు కెమికల్ ఇంజనీరింగ్/ సిమెంట్ టెక్నాలజీలో డిప్లొమా పాసై ఉండాలి. ఫిట్టర్ ఉద్యోగానికైతే.. ఐటీఐ పాసై ఉండాలి. ఎలక్ట్రీషియన ఉద్యోగానికి ఐటీఐ(ఎలక్ట్రీషియన్) పాసై ఉండాలి. ఇన్ స్ట్రుమెంట్ మెకానిక్ ఉద్యోగానికి ఐటీఐ(ఇన్ స్ట్రుమెంట్ మెకానిక్) పాసై ఉండాలి.
వయస్సు: బర్నర్ ఉద్యోగాలకైతే 40 ఏళ్లలోపు వారు అప్లై చేసుకోవాలి. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్ స్ట్రుమెంట్ మెకానిక్ ఉద్యోగాలకు 18 ఏళ్లు నిండి ఉన్న 35 ఏళ్ల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చిరునామా: బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(BECIL), BECIL భవన్, C-56/A-17, Sector-62, నోయిడా-201307(ఉత్తరప్రదేశ్)
అప్లికేషన్ ఫీజు: రూ.590, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.295 ఫీజును ఆఫ్ లైన్ విధానం ద్వారా డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో.. బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(BECIL) పేరు మీదుగా చెల్లించాలి.
Also Read: TGPSC Group 2: ఇదిగో.. గ్రూప్-2 కటాఫ్.. KEY ఎప్పుడంటే..?
జీతం: ఉద్యోగాన్ని బట్టి నెలకు రూ.12,360 నుంచి రూ.40,000 వరకు ఉంటుంది.
దరఖాస్తు విధానం: 2025 జనవరి 8