TGPSC Group 2: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 783 గ్రూప్-2 ఉద్యోగాలకు పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. తెలంగాణలో డిసంబర్ 15, 16 తేదీల్లో గ్రూప-2 పరీక్షలు ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రభుత్వం నిర్వహించింది. ఎప్పుడో రెండెళ్ల కింద జరగాల్సిన పరీక్షలు పోస్ట్ పోన్ అవుతూ చివరికీ ఎట్టకేలకు సజావుగా జరిగాయి.
డిసెంబర్ 15న ఉదయం 10 గంటలకు పేపర్-1 జనరల్ స్టడీస్ పరీక్ష జరగగా.. మధ్యాహ్నం 3 గంటలకు పేపర్-2 హిస్టరీ, పాలిటీ అండ్ సోషయాలజీ జరిగింది. మరుసటి రోజైన డిసెంబర్ 16 న ఉదయం 10 గంటలకు పేపర్-3 ఎకానమీ పరీక్ష జరగగా.. మధ్యాహ్నం 3 గంటలకు పేపర్-4 తెలంగాణ ఉద్యమం జరిగింది. ఒక్కో పేపర్ 150 మార్కుల చొప్పున మొత్తం 600 మార్కులకు గానూ టీజీపీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. పరీక్షలో ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ లేదు.
అయితే.. టీజీపీఎస్సీ నిర్వహించిన ఈ గ్రూప్-2 పరీక్షలు ఎన్ని మార్కులు వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంది..? కటాఫ్ మార్కులు ఎంత వరకు ఉండొచ్చు..? ఏఏ పేపర్ కఠినంగా వచ్చింది..? అనే ఒకసారి తెలుసుకుందాం.. ముందుగా పేపర్ లెవల్ గురించి ఓ సారి తెలుసుకుందాం..
పేపర్-1, పేపర్-2 ఎలా ఉన్నాయంటే..?
గ్రూప్-2 పేపర్-1 కఠినంగా వచ్చిందని చెప్పవచ్చు. కరెంట్ అఫైర్ వన్ ఇయర్ బ్యాక్ నుంచి ప్రశ్నలు వచ్చాడు. అవ్వి కూడా హార్డ్ లెవల్‌లో ప్రశ్నలు వచ్చాయి. జాగ్రఫీ విషయానికి వస్తే ఎవరూ ఎక్కడ కనబడని ప్రశ్నలు రాగా.. ముఖ్యంగా వరల్డ్ జాగ్రీపీ అయితే చాలా కఠినంగా ప్రశ్నలు వచ్చాయి. మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లిష్ కూడా అదే లెవల్ లో రావడంతో చాలా మంది అభ్యర్థులు పేపర్ కఠినంగా వచ్చిందనే భావిస్తున్నారు. పేపర్- 70 నుంచి 80 వస్తే మంచి స్కోరుగా చెప్పవచ్చు. ఇక పేపర్ -2 తెలంగాణ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ చాలా కఠినమైన ప్రశ్నలు వచ్చాయి. పాలిటీ, సొసైటీ ఈజీ టూ మోడరేట్ గా ప్రశ్నలు రావడంతో.. పేపర్-2 లో 90 నుంచి 100 మార్కులు వస్తే మంచి స్కోరుగా చెప్పవచ్చు.
పేపర్-3, పేపర్-4 ఎలా ఉన్నాయంటే..?
ఇక, పేపర్-3 ఎకానమీకి సంబంధించి పేపర్ కఠినంగా వచ్చింది. ఇండియన్ ఎకానమీ ఈజీ టూ మోడరేట్ గా ప్రశ్నలు వచ్చాయి. తెలంగాణ ఎకానమీ అయితే 2021-22, 2022-23 సర్వేల నుంచి ప్రశ్నలు రావడంతో చాలా మంది అభ్యర్థులు ప్రశ్నలకు ఆన్సర్ చేయలేకపోయారు. పేపర్-3 లో 85 నుంచి 95 మార్కుల మధ్య స్కోర్ వస్తే మంచి స్కోరుగా చెప్పవచ్చు. ఇక పేపర్-4 తెలంగాణ ఉద్యమం చాలా మంది అభ్యర్థులు 140 చేయగలమని భావించారు. తీరా క్వశ్చన్ పేపర్ చూస్తే ప్రశ్నలు అంతా సులభంగా ఏం రాలేదు. ఇందులో 100 నుంచి 110 మార్కులు వస్తే మంచి స్కోరుగా చెప్పవచ్చు.
పేపర్-1 జీఎస్: 70-80
పేపర్-2 హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ: 90-100
పేపర్-3 ఎకానమీ: 85-95
పేపర్-4 తెలంగాణ ఉద్యమం: 100-110
Tech Mahindra Jobs: టెక్ మహీంద్రాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు.. త్వరపడండి..
ఓవరాల్ అన్ని పేపర్లలో కలిపి 340 మార్కులు దాటితే మంచి స్కోర్ అనే చెప్పవచ్చు. 350 మార్కులు దాటిన వారందరూ హోప్ పెట్టుకోవచ్చు. 360 మార్కులు దాటిన వారికి మరింత ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అయితే టీజీపీఎస్సీ అఫీషయల్ కీ కోసం అభ్యర్థులు వేచి చూస్తున్నారు. అఫీషియల్ కీ వచ్చాక ఎన్ని మార్కులు వచ్చాయనేది అభ్యర్థులు తెలుసుకోవచ్చు. గ్రూప్-2 అండ్ గ్రూప్ -3 పరీక్షల కీ త్వరగా విడుదల చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.