Cochin Shipyard Jobs: మీరు టెన్త్ క్లాస్, ఐటీఐ పాస్ అయ్యారా..? ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నారా..? అయితే ఒక్కసారి ఈ నోటిఫికేషన్ చూడండి.
కేరళ రాష్ట్రం కొచ్చిలోని ప్రభుత్వం రంగ సంస్థ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్.. కాంట్రాక్ట్ విధానంలో వర్క్ మెన్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 224
పలు విభాగాల్లో వివిధ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఫ్యాబ్రికేషన్ అసిస్టెంట్(షీట్ మెటల్ వర్కర్, వెల్డర్), ఔట్‌ఫిట్ అసిస్టెంట్(మెకానిక్ డిజిల్, మెకానిక్ మోటర్ వెహికల్, ప్లంబర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రిక్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, షిప్ వ్రైట్ వుడ్, మెషినిస్ట్, ఫిట్టర్) ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: ఎస్ఎస్ఎల్‌సీ, సంబంధిత విభాగాల్లో ఐటీఐ పాసై ఉండాలి. ఉద్యోగ అనుభవం కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వేతనం: నెలకు రూ.23,300
వయస్సు: 45 ఏళ్లు మించరాదు.
ఎంపిక విధానం: ఆన్ లైన్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, ధ్రువ పత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.600 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు రాయితీ ఉంది)
దరఖాస్తు విధానం: ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: 2024 డిసెంబర్ 30
Also Read: DME AP Recruitment 2024: ఏపీలో 1289 ఉద్యోగాలు.. రూ.97,000 వరకు జీతం
ముఖ్యమైనవి:
ఉద్యోగాలు: 224
వేతనం: రూ.23,300
వయస్సు: 45 దాటొద్దు
అప్లికేషన్ లాస్ట్ డేట్: డిసెంబర్ 30, 2024