Dil Raju on Game Changer: ప్రస్తుతం ఆడియన్స్ అంతా ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా గేమ్ చేంజర్. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ కంప్లీట్ రోల్ లో కనిపిస్తున్న సినిమా ఇది. అంతేకాకుండా శంకర్ మొదటిసారి తెలుగులో చేస్తున్న సినిమా ఇది. శంకర్ టాలెంట్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అంతా పాన్ ఇండియా సినిమాలు గురించి మాట్లాడుతున్నారు గాని ఒకప్పుడు శంకర్ చేసిన కాన్సెప్ట్లు అన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ఉండేవి. విజువల్ ఎఫెక్ట్స్ ను తెలుగు సినిమాకి మొదట పరిచయం చేసిన ఘనత కూడా శంకర్ కే దక్కుతుంది. ఇక రీసెంట్ టైమ్స్ లో శంకర్ సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. కానీ ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తుంది అని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ సినిమాకి కార్తీక్ సుబ్బరాజు కథ అందించారు.
వాస్తవానికి కార్తీక్ సుబ్బరాజ్ ఈ కథను తనకోసం రాసుకున్నాడు. అయితే కథ అంతా పూర్తయిన తర్వాత వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్లు అంతా కూడా సరి ఈ కథ శంకర్ సార్ రేంజ్ లో ఉంది అని అనుకోవడం మొదలుపెట్టారు. అయితే ఈ కథకు శంకర్ సార్ కంప్లీట్ న్యాయం చేస్తారు అని చెప్పి ఈ కథను శంకర్ కు ఇచ్చారు. కార్తీక్ ఇచ్చిన కథకు శంకర్ ఎన్నో మార్పులు చేసి తనదైన శైలిలో మార్చారు. ఇకపోతే ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా రీసెంట్ గా ఒక ఈవెంట్లో సుకుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమాను నేను చిరంజీవితో కలిసి చూశాను. ఫస్ట్ ఆఫ్ హిట్, ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్, సినిమా క్లైమాక్స్ ఎక్స్లెంట్ అంటూ కొనియాడారు. రంగస్థలం సినిమాకు రాంచరణ్ కు నేషనల్ అవార్డు వస్తుంది అని ఊహించను కానీ రాలేదు కానీ గేమ్ చేంజెర్ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఈ సినిమాకు చరణ్ కు నేషనల్ అవార్డు వస్తుంది అంటూ తెలిపారు.
Also Read : Devara 2 Update: ఎన్టీఆర్ దేవర 2 నుంచీ గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్.. ఊహించలేదుగా..?
ఈ సినిమాను సంక్రాంతి కానుక జనవరి 10న రిలీజ్ చేయనున్నారు. తరుణంలో ఇప్పటివరకు దీనికి సంబంధించిన ట్రైలర్ అప్డేట్ ఇవ్వలేదు. ఇక రీసెంట్ గా ఒక అభిమాని ట్రైలర్ అప్డేట్ ఇవ్వకపోతే సూసైడ్ నోట్ కూడా రాశాడు. మొత్తానికి ఈ సినిమా ట్రైలర్ ను జనవరి ఒకటవ తారీఖున రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు దిల్ రాజు. గేమ్ చేంజెర్ సినిమాకు సంబంధించి అతిపెద్ద భారీ కటౌట్ ను అభిమానులు ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన ఈవెంట్ కి దిల్ రాజు హాజరయ్యారు. దిల్ రాజు మాట్లాడుతూ నా ఫోన్లో ట్రైలర్ ఉంది. కొన్ని చేంజెస్ చేయాలి ఆ చేంజ్ చేసి న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రిలీజ్ చేయబోతున్నాము అంటూ తెలిపారు.
Also Read : Rajamouli: 25 ఏళ్ల రజినీకాంత్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన రాజమౌళి.. చెప్పి మరీ సాధించాడుగా!