Pawan Kalyan : ఒకప్పుడు అభిమానుల మధ్య గొడవలు అనేవి ఒక రకంగా ఉండేవి. ఇప్పుడు అవి మరోరకంగా మారాయి. అప్పట్లో ఒక హీరో సినిమా ఎన్ని రోజులు, ఎన్ని సెంటర్స్ లో ఆడింది అని డిబేట్ నడిచేది. 100 రోజులు 50 రోజులు సినిమా ఆడే దాన్ని బట్టి దాన్ని సక్సెస్ డిసైడ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ఎంత కలెక్ట్ చేసింది అనేదాన్ని బట్టి సక్సెస్ డిపెండ్ అయి ఉంది.
రీసెంట్ టైంలో సోషల్ మీడియా ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్విట్టర్ లో అయితే ఫ్యాన్ వార్స్ విపరీతంగా జరుగుతాయి. కొంతమంది ప్లేస్ చెప్పుకొని గొడవలు పడిన సందర్భాలు, ఫ్యామిలీ మెంబర్స్ ను సైతం దూషించిన సందర్భాలు బోలెడున్నాయి. అయితే వీటి పైన కూడా పవన్ కళ్యాణ్ ఇన్ డైరెక్ట్ గా కామెంట్ చేశారు.
మీకు దమ్ముంటే తిరిగి కొట్టండి
హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ మీట్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ అనేక విషయాలను తెలిపారు. ముఖ్యంగా నా అభిమానులు సున్నితంగా ఉండకండి అయ్యా అంటూ పిలుపునిచ్చారు. ఏదైనా నెగిటివ్ కామెంట్ వస్తే బాధపడకుండా, మీకు దమ్ముంటే తిరిగి కొట్టండి అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కు ఎంత వరకు తెలుసో తెలియదో మనకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడూ సోషల్ మీడియాలో తగ్గరు. ఏదైనా ఒక నెగిటివ్ కామెంట్ వస్తే దానికి రెండంతలు సమాధానం చెప్తారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పాను కాబట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరింత స్ట్రాంగ్ గా సమాధానం ఇస్తారు.
మిక్స్డ్ టాక్
హరిహర వీరమల్లు సినిమా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమా నిన్ననే కొన్నిచోట్ల ప్రీమియర్స్ పడ్డాయి. అయితే ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది. ఫస్ట్ ఆఫ్ విపరీతంగా ఆకట్టుకుంది. సెకండ్ ఆఫ్ విషయానికి వచ్చేసరికి కొంత తడబాటు జరిగింది. కొన్ని సీన్స్ లో విఎఫ్ఎక్స్ దారుణంగా ఉంది. బహుశా ఇవి చిత్ర యూనిట్ దృష్టికి కూడా చేరి ఉండటం వలన, ఆ సీన్స్ ను కట్ చేసి అప్డేట్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా ఎప్పుడూ లేనివిధంగా ఈ సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ బాగా ఇన్వాల్వ్ అయ్యారు. ఒకవైపు ప్రమోషన్స్ లోనూ, అలానే సక్సెస్ ఈవెంట్ లోను పవన్ కళ్యాణ్ పాల్గొనడం అనేది చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించే విషయం.