NMDC LIMITED: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. హైదరాబాద్ లో ఉద్యోగం చేయాలనుకునే వారికి అయితే గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, హైదరాబాద్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారు వెంటనే దరఖాస్తు చేసుకోండి. డిగ్రీ, సీఏ/సీఎంఏ లేదా బీటెక్, ఎంబీఏ(ఫైనాన్స్) పాసైన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు అవుతారు. ఉద్యోగం సాధించిన వారికి భారీ వేతనం కూడా ఉంటుంది. ఉద్యోగాన్ని బట్టి రూ.50వేల నుంచి రూ.2లక్ష 60వేల వరకు వేతనం ఉంది. ఇలాంటి మంచి అవకాశాన్ని అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, పోస్టులు, వెకెన్సీలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, అప్లికేషన్ ప్రాసెస్ గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
హైదరాబాద్, నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NMDC LIMITED)లో ఖాళీగా ఉన్న జూనియర్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు అభ్యర్థులు జులై 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
మొత్తం వెకెన్సీల సంఖ్య: 17
హైదరాబాద్, నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో జూనియర్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
ఉద్యోగాలు – వెకెన్సీలు
జూనియర్ మేనేజర్ (ఫైనాన్స్) : 10 పోస్టులు
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) : 7 పోస్టులు
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, సీఏ/సీఎంఏ లేదా బీటెక్, ఎంబీఏ(ఫైనాన్స్) పాసై ఉండాలి. వర్స్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
దరఖాస్తుకు చివరి తేది: 2025 జులై 28
వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. జూనియర్ మేనేజర్‌కు 30 ఏళ్లు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌కు 45 ఏళ్ల వయస్సు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: ఉద్యోగాన్ని బట్టి జీతం ఉంటుంది. నెలకు జూనియర్ మేనేజర్‌కు రూ.50000 – 1,60,000, అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌కు రూ.1,00,000 – రూ. 2,60,000 జీతం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.
ఉద్యోగ ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 17
దరఖాస్తుకు చివరి తేది: జులై 28
ALSO READ: Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు అప్లై చేశారా.. దరఖాస్తుకు ఇంకా వారం రోజలు..!
ALSO READ: AIIMS Recruitment: టెన్త్, ఇంటర్‌తో 3501 ఉద్యోగాలు.. తక్కువ కాంపిటేషన్, అప్లై చేస్తే జాబ్ మీదే బ్రో