Free Coaching: మహబూబ్ నగర్ జిల్లా నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. మైనార్టీ విద్యావంతులైన యువతకు ఇది గుడ్ న్యూస్. తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్, కెరీర్ కౌన్సిలింగ్ సెంటర్ తరపున శుభవార్త చెప్పింది. నాలుగు నెలల ఉచిత ఫౌండేషన్ కోర్సు కింద కోచింగ్ ప్రారంభించనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి శంకరాచారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు దరఖాస్తు తేదీని వచ్చేనెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు.
గ్రూప్స్ పరీక్షలు, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్ ఉద్యోగాలతో పాటు భవిష్యత్‌లో జరిగే ఇతర ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధం చేసేందుకు కోచింగ్ ఉంటుందన్నారు. మైనార్టీ యువత దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన మైనార్టీ యువత అవసరమైన సర్టిఫికెట్లు, దరఖాస్తును వచ్చేనెల 15 వరకు ఐడీఓసీలోని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని కోరారు. వివరాలకు 9440970730 సంప్రదించాలని ఆయన సూచించారు.
శిక్షణ: గ్రూప్-1,2,3,4 పరీక్షలు, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్ ఉద్యోగాలతో పాటు ఇతర ప్రభుత్వం ఉద్యోగ పోటీ పరీక్షలు..
ఫోన్ నంబర్: 9440970730
గడువు: జనవరి 15
Also Read: Engineering Jobs: బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. వెంటనే ఈ ఛాన్స్ ను సద్వినియోగం చేసుకోండి.