Best OTT Benefit Plans : బడ్జెట్ లో బెస్ట్ ప్లాన్స్ కోసం చూస్తున్నారా? వోడాఫోన్ ఐడియా ఓటీటీ ఫీచర్స్ డేటా ప్రయోజనాలు అది తక్కువ ధరకే లభిస్తున్నాయి. రూ. 100 కంటే తక్కువకే బెస్ట్ OTT బెనిఫిట్స్ ప్లాన్ ను అందిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్స్ దాదాపు అన్ని ప్లాట్ఫామ్స్ లో అందుబాటులో ఉంది.
రోజు రోజుకు పెరుగుతున్న డిజిటలైజేషన్ తో కనెక్టివిటీ అత్యవసరంగా మారిపోయింది. ప్రతి ఏడాది లాంఛ్ అవుతున్న కొత్త స్మార్ట్ ఫోన్స్ అదిరిపోయే బెనిఫిట్స్ తో మరింత కనెక్టివిటీని పెంచేస్తున్నాయి. ఈ డిజిటల్ యుగంలో డేటా యూసేజ్ కూడా అత్యవసరంగా మారింది. దీంతో ప్రముఖ టెలికాం సంస్థలన్నీ అదిరిపోయే డేటా ప్లాన్స్ ను తీసుకొస్తున్నాయి. ఒకదానికొకటి పోటీ పడుతూ ఎప్పటికప్పుడు లేటెస్ట్ బెనిఫిట్స్ తో మరిన్ని ప్లాన్స్ ను పరిచయం చేస్తున్నాయి.
పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్, ఓటీటీ ప్రయోజనాలతో టాప్ టెలికాం సంస్థలన్నీ రీఛార్జ్ ప్లాన్స్ ను అందిస్తున్నాయి. టెలికాం ఆపరేటర్లు కస్టమర్ల దృష్టిని ఆకర్షించడానికి రోజూ వారి డేటా ప్లాన్స్ నుంచి వార్షిక ప్లాన్స్ సైతం అందుబాటులోకి తీసుకొచ్చేస్తున్నాయి. వీటిలో కొన్ని రీఛార్జ్ ప్లాన్స్ కు ఓటీటీ సబ్స్క్రిప్షన్ తో పాటు ఇతర ప్రయోజనాలు సైతం అందిస్తున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా వోడాఫోన్ ఐడియా అదిరిపోయే ఓటీటీ బెనిఫిట్స్ తో బెస్ట్ ప్లాన్ ను తీసుకొచ్చింది.
5G మొబైల్ సేవలను ప్రారంభించడంలో Vodafone-Idea దాని పోటీదారుల కంటే వెనుకబడి ఉన్న మాట వాస్తవమే. కానీ ఇది ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల పరంగా గట్టి పోటీనే ఇస్తుంది. ఎయిర్‌టెల్, జియోతో పోటీపడే అనేక రీఛార్జ్ ప్లాన్‌లను టెల్కో అందిస్తుంది. ఈ ప్లాన్‌లలో ఒకటి OTT ప్రయోజనాలకు సంబంధించినది కూడా. VI OTT ఫీచర్లు, డేటా ప్రయోజనాలను రూ. 100 కంటే తక్కువకు అందిస్తోంది. Vodafone Idea ఈ రీఛార్జ్ దాదాపు అన్ని సర్కిల్‌లలో కేవలం రూ. 95కే అందుబాటులో ఉంది. అయితే ఇది OTT బండిల్ డేటా వోచర్.
Vodafone-Idea రూ. 100 రీఛార్జ్ ప్లాన్ –
Vodafone-Idea రూ.95 డేటా వోచర్‌పై వినియోగదారులకు 4GB డేటా ఉంటుంది. అదనంగా 14 రోజుల వ్యాలిడిటీని కూడా పొందవచ్చు. కానీ ఇది సర్వీస్ చెల్లుబాటు కాదు.. అంటే మీ ప్రస్తుత రీఛార్జ్ ప్లాన్ చెల్లుబాటు ఈ వోచర్‌తో పెంచే ఛాన్స్ ఉండదు.
ఈ OTT వోచర్ గురించి తెలిపిన వొడాఫోన్.. 4 GB డేటాతో పాటు వినియోగదారులకు Sony Liv మొబైల్ ప్లాట్‌ఫారమ్ సబ్‌స్క్రిప్షన్ 28 రోజుల పాటు అందిస్తామని తెలిపింది. అయితే 4 GB డేటా 14 రోజుల్లో ముగుస్తుంది కానీ Sony Liv వాలిడిటీ 28 రోజులు ఉంటుంది. VI కస్టమర్ అయ్యి Sony Livకి సభ్యత్వం పొందాలనుకుంటే, రూ. 95 OTT వోచర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. .
ఇది Vodafone-Idea చౌకైన OTT డేటా వోచర్. ఆ తర్వాత కంపెనీ రూ. 151, రూ. 169 ప్లాన్‌లను కూడా కలిగి ఉంది. వీరందరికీ మూడు నెలల పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తారు. వాటితో సర్వీస్ చెల్లుబాటు కూడా లేదు.
ALSO READ : జనవరి అంటేనే మెుబైల్ సీజన్ మరి.. రూ.15వేలలోపే ఎన్ని బెస్ట్ మెుబైల్సో!