Engineering Jobs: ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన గుడ్‌గావ్‌లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
గుడ్ గావ్ లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(RITES) లో ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థుల ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఓసారి చూసేద్దాం.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 05
ఇందులో రెసిడెంట్ ఇంజినీర్(సివిల్), రెసిడెంట్(మెకానికల్)-2, రెసిడెంట్ ఇంజినీర్(ఎలక్ట్రికల్)-01 ఉద్యోగం ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: సివిల్, మెకానికల్, ప్రొడక్షన్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్, మెకానికల్ అండ్ ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగాల్లో డిప్లొమా పాస్ తో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: 40 ఏళ్లు మించి ఉండకూడుదు.
వేతనం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ.16,828 జీతం ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.600(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.300 వరకు ఉంటుంది)
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ తదితర అంశాల ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరితేది: 2025 జనవరి 14
రాత పరీక్ష తేది: 2025 జనవరి 19
రాత పరీక్ష ప్రదేశం: ఢిల్లీ, గుడ్ గావ్, కోల్ కతా లో పరీక్ష రాయాల్సి ఉంటుంది.
Also Read: SBI Jobs: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. హైదరాబాద్‌లోనే జాబ్.. పూర్తి వివరాలు ఇదిగో..
అఫీషియల్ వెబ్ సైట్: https://www.rites.com/