BigTV English

AIIMS Recruitment: టెన్త్, ఇంటర్ అర్హతతో 4597 ఉద్యోగాలు.. దరఖాస్తు చేస్తే ఉద్యోగం.. జీతం రూ.75,000

AIIMS Recruitment: టెన్త్, ఇంటర్ అర్హతతో 4597 ఉద్యోగాలు.. దరఖాస్తు చేస్తే ఉద్యోగం.. జీతం రూ.75,000

AIIMS Recruitment: టెన్త్, ఇంటర్, డిప్లొమా లేదా డిగ్రీ పాసైన అభ్యర్థులకు ఇంత కన్నా మంచి అవకాశం మళ్లీ రాదు. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హలైన అభ్యర్థలందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తుకు  మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ ఉద్యోగానికి మీరు కనుకు సెలెక్ట్ అయితే భారీ వేతనం లభిస్తుంది. ఇలాంటి ఉద్యోగాలకు పోటీతత్వం తక్కువ ఉండే అవకాశాలున్నాయి. కాబట్టి ఉద్యోగానికి అప్లై చేసుకుని ప్రిపరేషన్ మొదలు పెడితే ఉద్యోగం మీ సొంతం అవుతోంది.


ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) భారీ మొత్తంలో గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండర్, ల్యాబ్ అటెండర్ లా మొత్తం 66 రకాల ఉద్యోగాలున్నాయి. నిన్ననే ఈ నోటిఫికేషన్ రిలీజైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉద్యోగాలు వేకన్సీ ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.

మొత్తం ఉద్యోగాల సంఖ్య: 4597


ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రిక్రూట్ మెంట్‌లో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్, స్టోర్ కీపర్, ఫార్మసిస్ట్, జూనియర్ రికార్డ్ ఆఫీసర్, లైబ్రరీ అటెండర్, అటెండర్ & డ్రైవర్ వంటి 66 రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

విద్యార్హత: 10th, ఇంటర్మీడియట్, డిప్లొమా లేదా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఉద్యోగాలకు  దరఖాస్తు చేయవచ్చు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉద్యోగాలు వేకన్సీ ఉన్నాయి.  కాబట్టి తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ఇదే మంచి అవకాశం. దరఖాస్తు చేసుకోండి.

వయస్సు: 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్నఅభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. (SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది, దివ్యాంగులకు పదేళ్లు వయస్సు సడలింపు ఉంటుంది. )

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ: జనవరి 7, 2025

ఆన్‌లైన్ అప్లికేషన్ ముగింపు తేది: జనవరి 31, 2025

రాత పరీక్ష తేదీలు: 2025 ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.

జీతం: ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగాన్ని బట్టి నెలకు ₹25,000 నుండి ₹70,000 వరకు జీతం ఉంటుంది. తదుపరి TA, DA, HRA వంటి అలవెన్సులు కూడా లభిస్తాయి.

దరఖాస్తు ఫీజు:  సాధారణ అభ్యర్థులకు: రూ.3,000 (SC, ST, EWS అభ్యర్థులకు: రూ.2,400 ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు)

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసేముందు పూర్తి నోటిఫికేషన్ చదవడం మంచిది.

అప్లికేషన్ లింక్: https://rrp.aiimsexams.ac.in

ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష 2025 ఫిబ్రవరి 26 నుండి 28 తేదీల్లో ఉంటుంది. స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

పూర్తి నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ చూడండి: https://creaiims.aiimsexams.ac.in/

ముఖ్యమైనవి:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేది: జనవరి 7, 2025

దరఖాస్తు ప్రక్రియ ముగింపు తేది: జనవరి 31, 2025

ఎగ్జామ్ డేట్: ఫిబ్రవరి 26 నుంచి 28

అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

NOTE: దరఖాస్తుకు మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉంది.

Related News

EMRS Recruitment: ఈ ఉద్యోగం కొడితే గోల్డెన్ లైఫ్.. మొత్తం 7,267 ఉద్యోగాలు, లక్షల్లో వేతనాలు భయ్యా

AAI Recruitment: రూ.1,40,000 జీతంతో భారీగా ఉద్యోగాలు.. బంగారం లాంటి జాబ్, దరఖాస్తుకు 5 రోజులే గడువు

IBPS Recruitment: బిగ్ గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో 13,217 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పెంపు

Section Controller Jobs: రైల్వేలో భారీగా సెక్షన్ కంట్రోల్ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు, నెలకు రూ.35,400 జీతం

ECIL Hyderabad: హైదరాబాద్‌లో భారీగా ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే జాబ్ వచ్చుడే, డోంట్ మిస్

Prasar Bharati Jobs: ప్రసార భారతిలో నుంచి ఉద్యోగ నోటిఫికేషన్.. మంచి వేతనం, ఇంకా 6 రోజుల సమయమే

Telangana Jobs: తెలంగాణలో 1623 ఉద్యోగాలు.. అక్షరాల రూ.1,37,050 జీతం.. ఇదే మంచి అవకాశం

IGI Aviation Services: ఎయిర్‌పోర్టుల్లో 1446 ఉద్యోగాలు.. టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్, ఇంకా 2 రోజులే గడువు

Big Stories

×