TGPSC Group-1,2,3 Exams: రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత తెలంగాణలో గ్రూప్-1,2,3 అలాగే డీఎస్సీ పరీక్షలు జరిగాయి. అయితే ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ప్రభుత్వం పరీక్షలు నిర్వహించింది. డీఎస్సీ పరీక్షలు రాసిన వెంటనే ఫలితాలను ఇచ్చి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఎంపికైన వారు టీచర్ గా ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఇక గ్రూప్స్ పరీక్షలు బాగా రాసిన అభ్యర్థులు అయితే ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే మరి కొందరు ఈ ఏడాదిలో వచ్చే నోటిఫికేషన్ లో ఎలాగైనా ఉద్యోగం కొట్టాలని దృడ సంకల్పంతో ప్రిపేర్ అవుతున్నారు.
అయితే, ఈ ఏడాది జూన్, జూలై లో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటినుంచే ప్రిపరేషన్ షురూ చేస్తే ఉద్యోగం ఈజీగా సాధించవచ్చు. గ్రూప్-2 ఎగ్జామ్ లో ఎక్కువగా ప్రభావితం చేసే అంశాలు తెలంగాణ చరిత్ర, ఉద్యమం, సంస్కతి. వీటిని అన్నింటిని కలిపి అధ్యయనం చేస్తే మంచి స్కోర్ సాధించవచ్చు. తెలంగాణ సంస్కృతిలో భాగంగా పండుగలు, జాతరలు, ప్రదేశాలు, తెగలు, కళారూపాలు, వంటకాలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ వీటికి సంబంధించిన కొత్త సమాచారం కరెంట్ అఫైర్స్ రూపంలో నేర్చుకుంటూనే ఉండాలి. కరెంట్ అఫైర్ ను లింక్ చేస్తూ తెలంగాణ సంస్కృతికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి.
ALSO READ: CBI Recruitment: సీబీఐలో 1000 ఉద్యోగాలకు ఎల్లుండే లాస్ట్ డేట్ మిత్రమా..!
చరిత్ర, పాలిటీ, సోషయాలజీ ఇలా చదవండి..
తెలంగాణ చరిత్రకు సంబంధించి మొన్న జరిగిన గ్రూప్-2 పరీక్షలో ప్రశ్నలు కఠినంగా వచ్చాయి. ఈ ప్రశ్నలకు చాలా మంది అభ్యర్థులు సమాధానాలు గుర్తించలేకపోయారు. అయితే, పేపర్ అందరికీ కఠినమే కాబట్టి ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. తెలుగు అకాడమీ పుస్తకాలను రెండు మూడు సార్లు రివిజన్ చేస్తే మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. మొన్న జరిగిన గ్రూప్-2 పరీక్షలో కొంత తేలికగా వచ్చిన పేపర్ ఏదైనా ఉంది అంటే.. అది పాలిటీ అని చెప్పవచ్చు. పాలిటీ నుంచి గ్రూప్-2 పరీక్షలో 50 ప్రశ్నలకు గానూ బాగా చదివిన అభ్యర్థులు 40కి పైగా మార్కులు చేశారు. పాలిటీ సబ్జెక్టును కరెంట్ అఫైర్ తో లింక్ చేసుకుని చదివితే మంచి స్కోర్ చేయవచ్చు. ఇక పేపర్-2లో సోషయాలజీకి సంబంధించి కవుల పేర్లు పెద్దగా చదవాల్సిన అవసరం లేదు. చాలా మంది అభ్యర్థులకు తెలియక వందల మంది కవుల పేర్లు గుర్తు పెట్టుకుంటారు. తెలంగాణలో రెండు సార్లు జరిగన గ్రూప్-2 పరీక్షలో కవుల పేర్లు పెద్దగా అడిగింది లేదు. కాబట్టి కవుల పేర్లను చదవకుండా సబ్జెక్ట్ నేర్చుకుంటే మంచి స్కోర్ చేయవచ్చు. సోషయాలజీలో మంచి స్కోర్ చేయడానికి తెలుగు అకాడమీ పుస్తకాలను ప్రామాణికంగా తీసుకోవచ్చు.
ఎకానమీలో మంచి స్కోర్ చేస్తే జాబ్ నీదే..
గ్రూప్-2 పరీక్షలో అత్యంత కఠినమైన పేపర్ ఎకానమీ. ఎకానమీలో మంచి స్కోర్ చేసిన వారు ఉద్యోగానికి దగ్గర్లో ఉంటారు. మొన్న జరిగిన గ్రూప్-2 పరీక్షలో ఎకానమీ పేపర్ కఠినంగా వచ్చింది. ఎకానమీ పేపర్ లో 90 మార్కులు చేసిన అభ్యర్థులు అందరూ మంచి స్కోర్ చేసినట్లే చెప్పవచ్చు. ఎకానమీలో ముఖ్యంగా ఇండియన్, స్టేట్ సోషల్ ఎకానమీ సర్వే పుస్తకాన్ని రెండు, మూడు సార్లు రివిజన్ చేయాలి. తెలంగాణ ఎకానమీకి సంబంధించి తెలుగు అకాడమీ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది. రెగ్యులర్ గా కరెంట్ అఫైర్స్ ను ఎకానమీతో లింక్ చేసుకుంటూ చదివితే బెస్ట్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది.
తెలంగాణ ఉద్యమం స్కోరింగ్ పేపర్.. కానీ మొన్న జరిగిన గ్రూప్-2లో మాత్రం..
గ్రూప్-2 నాలుగో పేపర్ తెలంగాణ ఉద్యమం. ఈ పేపర్ లో మంచి స్కోర్ చేయవచ్చు. కానీ ఇటీవల జరిగిన గ్రూప్-2 పరీక్షలో పేపర్ అంతా సులువుగా ఏం రాలేదు. వంద మార్కులు చేస్తే బెస్ట్ స్కోర్ గా చెప్పవచ్చు. 2016 గ్రూప్-2 ఎగ్జామ్ లో చాలా మంది అభ్యర్థులకు 130 నుంచి 140 మార్కులు వచ్చాయి. కానీ ఈసారి జరిగిన గ్రూప్-2 పరీక్షలో 100 నుంచి 110 మార్కులు చేస్తే అదే గొప్ప స్కోర్ గా చెప్పవచ్చు. ఎందుకంటే పేపర్ 2016 వచ్చినంతా సులువుగా ఏం రాలేదు. కొన్ని ప్రశ్నలు అయితే ఏ పుస్తకాల్లో లేవు. తెలంగాణ ఉద్యమం పేపర్ కు వి. ప్రకాశ్, తెలుగు అకాడమీ పుస్తకాలను చదివితే మంచి స్కోర్ చేయవచ్చు.
ALSO READ: Realme P3 Series: రియల్‌మి P3 ప్రో.. ఓడియమ్మ, నీటిలో పడినా ఏం కాదా..? మస్త్ ఉంది గురూ!
విజయం నీదే..
ఈ ఏడాదిలో వచ్చే గ్రూప్-1,2,3 నోటిఫికేషన్లకు ఇప్పటి నుంచి ప్రణాళికబద్ధంగా చదువుకుంటూ వెళ్తే విజయం మీ సొంతం అవుతోంది. జూన్, జూలై నెలలో గ్రూప్స్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. రోజువారీ సబ్జెక్ట్ ను లింక్ చేసుకుంటూ కరెంట్ అఫైర్స్ చదివితే గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల్లో మంచి మార్కలుు పొందుతారు. గ్రూప్-2 ఉద్యోగం మీ సొంతం అవుతోంది.