BigTV English
Advertisement

Realme P3 Series: రియల్‌మి P3 ప్రో.. ఓడియమ్మ, నీటిలో పడినా ఏం కాదా..? మస్త్ ఉంది గురూ!

Realme P3 Series: రియల్‌మి P3 ప్రో.. ఓడియమ్మ, నీటిలో పడినా ఏం కాదా..? మస్త్ ఉంది గురూ!

Realme P3 Series: రియల్ మీ ఇప్పుడు కొత్త మొబైల్ ఫోన్ ను లాంఛ్ చేసింది. రియల్‌మి కొత్త మోడళ్లలో రియల్‌మి P3 5G, P3x 5G, P3 Ultra, P3 Pro ఫోన్లను లాంచ్ చేసింది. ఈ సిరీస్ ఫోనల్లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ లో 50 మెగా ఫిక్సెల్ ప్రైమరీ కెమెరా, 6000mAh బ్యాటరీ కెపాసిటీని కల్గి ఉంది.  Realme P3 Pro 5G స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 చిప్‌సెట్‌తో పని చేస్తుంది. ఈ స్మార్ట్ మొబైల్స్ Realme UI 6.0 యూజర్ ఇంటర్‌ఫేస్‌తో పాటు Android 15 వెర్షన్ పై పని చేస్తాయి.


ALSO READ: CBI Recruitment: సీబీఐలో 1000 ఉద్యోగాలకు ఎల్లుండే లాస్ట్ డేట్ మిత్రమా..!

మన దేశంలో రియల్ మీ P3 Pro 5G ప్రారంభ ధర 8GB RAM, 128GB స్టోరేజీ కలిగిన మొబైల్ ధర రూ.23,999గా ఉంది.  8GB+256GB, 12GB+256GB వేరియంట్‌లలో కూడిన మొబైల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి ధర వరుసగా రూ.24,999గా, రూ. 26,999గా ఉన్నాయి. అలాగే హ్యాండ్‌సెట్ గెలాక్సీ పర్పుల్, నెబ్యులా గ్లో, సాటర్న్ బ్రౌన్ కలర్ ఆప్షన్‌లలో  కలిగిన స్మార్ట్ మొబైల్స్ ఫిబ్రవరి 25 నుండి కంపెనీ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ లలో అందుబాటులో ఉన్నాయి. మరోవైపు, రియల్ మీ P3x 5G ధర రూ. 13,999 ఉండగా.. 6GB+128GB, 8GB+128GB RAM వెర్షన్ కలిగిన మొబైల్ ధర రూ.14,999గా ఉంది. ఇది లూనార్ సిల్వర్, మిడ్‌నైట్ బ్లూ, స్టెల్లార్ పింక్ అనే మూడు రంగులతో కూడిన ఈ మొబైల్స్ రియల్‌ మీ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఫిబ్రవరి 28న అందుబాటులోకి రానున్నాయి.


వినియోగదారులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. సంబంధించిన బ్యాంక్ కార్డులను ఉపయోగించి తక్కువ ధరకు మొబైల్ ఫోన్ లను పొందవచ్చు. రియల్ మీ P3 Pro 5G మొబైల్ పై 2,000 తగ్గింపు, Realme P3x 5Gపై 1,000 తగ్గింపు లభించనుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ మొబైల్ ను తక్కువ ధరకు కొనేయండి.  Realme P3 Pro 5G, Realme P3x 5G ఈ రెండు స్మార్ట్ మొబైల్స్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా పని చేయనున్నాయి. రియల్‌ మీ UI 6.0పై రన్ డ్యూయల్ సిమ్ లు పని చేస్తాయి. రియల్ మీ P3 Pro 5G స్మార్ట్ మొబైల్ 12GB RAMతో జత చేయబడిన స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 ద్వారా పని చేయనుంది. Realme P3x 5G స్మార్ట్ మొబైల్  డైమెన్సిటీ RAM మరియు 64800 చిప్ కలిగి ఉంది.

రియల్ మీ P3 Pro 5G మొబైల్ 6.83 అంగుళాలు 1.5K (1,472×2,800 పిక్సెల్‌లు), క్వాడ్ కర్వ్డ్ అమోలిడ్ స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్, 450ppi పిక్సెల్ డెన్సిటీతో అమర్చబడి ఉంటుంది. Realme P3x 5G 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాలతో -HD+ (1,080×2,400 పిక్సెల్‌లు) LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. ఫోటోలు, వీడియోల కోసం, Realme P3 Pro 5G సోనీ IMX896 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ముందు భాగంలో, హ్యాండ్‌సెట్‌లో సోనీ IMX480 సెన్సార్‌తో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అమర్చారు. Realme P3x 5G కూడా f/1.8 ఎపర్చర్‌తో 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, అలాగే 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. రెండు ఫోన్‌లు వెనుకవైపు పేర్కొనబడని 2-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉన్నాయి.

రియల్ మీ P3 Pro 5G (UFS 2.2), Realme P3x 5G (eMMC 5.1)లో వరుసగా 256GB, 128GBలతో కూడిన స్టోరేజీలను కలిగి ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌లు USB టైప్-సి పోర్ట్‌తో పాటు 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్, GPS కనెక్టివిటీ సపోర్టును కలిగి ఉంది.

ALSO READ: Rishab Shetty: ఇక్కడ హనుమంతుడు.. అక్కడ ఛత్రపతి శివాజీ.. కాంతార హీరో లక్ మాములుగా లేదయ్యా

Realme P3 Pro 5G, Realme P3x 5G రెండూ వరుసగా 80W, 45W వద్ద ఛార్జ్ చేయగల 6,000mAh బ్యాటరీ కెపాసిటీని కలిగి ఉన్నాయి. హ్యాండ్‌సెట్‌లు ‘మిలిటరీ గ్రేడ్’ షాక్ రెసిస్టెన్స్ కలిగి ఉంది. దుమ్ముదూళి, అలాగే నీటి నిరోధకత కోసం IP68+IP69 రేటింగ్‌లను కలిగి ఉన్నాయి. Realme P3 Pro 5Gలో AI బెస్ట్ ఫేస్, AI ఎరేస్ 2.0, AI మోషన్ డిబ్లర్, AI రిఫ్లెక్షన్ రిమూవర్ వంటి కొన్ని అద్భుతమైన AI ఫీచర్లను కూడా ఈ స్మార్ట్ మొబైల్ లో ఉన్నాయి.

Related News

Vivo 78 Launch: వివో 78 కొత్త లుక్‌.. ఫోటో లవర్స్‌, గేమర్స్‌కి డ్రీమ్ ఫోన్‌..

Vivo Y500 Pro: త్వరలో Vivo Y500 Pro లాంచ్, ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

Apple iPhone 18: ఐఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. సూపర్ స్మార్ట్ ఫీచర్లతో వచ్చేస్తోన్న

Moto G67 Power: 7,000mAh బ్యాటరీ, 6.7 ఇంచుల డిస్ ప్లే.. రిలీజ్ కు ముందే Moto G67 స్పెసిఫికేషన్లు లీక్!

Lava Agni 4: త్వరలో లావా అగ్ని 4 లాంచింగ్.. డిజైన్, స్పెసిఫికేషన్లు అదుర్స్ అంతే!

Free ChatGPT: ఇండియాలో చాట్ జీపీటీ ఫ్రీ.. ప్లాన్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే?

Mobile Battery: వంద శాతం వద్దు బ్రో.. ఇది అస్సలు మంచి పద్ధతి కాదు!

Headphones under rs 5000: రూ. 5 వేల లోపు అదిరిపోయే హెడ్‌ ఫోన్స్.. వెంటనే కొనేయండి!

Big Stories

×